కళ్లు మూసుకొని చదివినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న విద్యార్థి!

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ గురించి ఎపుడైనా విన్నారా? ఈ కధనం మొత్తం చదివితే మీకే అర్ధం అయిపోతుంది.వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సిలిగురికి చెందిన దక్ష్‌ అనే 11ఏళ్ల బాలుడి అసమాన ప్రతిభ అతనిని ఇపుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలిపింది.

 11 Years Old West Bengal Boy Bags India Book Of Records By Reading With His Eyes-TeluguStop.com

ఆ బాలుడి టాలెంట్ చూసి స్థానికులతో పాటు స్కూల్ టీచర్స్ ఆశ్చర్యపోతున్నారు.సాధారణంగా కంటి చూపు లేనిదే పాఠ్య పుస్తకాలు చదవలేము.

అలాంటిది అతగాడు పాఠ్య పుస్తకాలనే కాకుండా దేవుని పుస్తకాలు కూడా ఇట్టే చదివేస్తాడు.

Telugu Daksh Singh, Eye, India, Kid Superpower, Rare, Eyes, Unique, Bengal Boy-L

వివరాల్లోకి వెళితే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సిలిగురికి చెందిన దక్ష్‌ అనే 11ఏళ్ల బాలుడు కళ్లు మూసుకుని పుస్తకం మొత్తం సునాయాసంగా చదివేస్తాడు.అతని నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు అదెలా సాధ్యం అని అవాక్కవుతున్నారు.కొంతమంది అయితే ఇదంతా బూటకం అని కూడా కొట్టి పారేస్తున్నారు.

అయితే అతగాడికి ఊరికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించదు కదా! దక్ష్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాటలు సరిగా వచ్చేవి కాదట, అదేవిధంగా పెద్దగా చదివే వాడు కూడా కాదు.పరీక్షల్లో మంచి మార్కులే వచ్చినప్పటికి క్లాస్‌లో వాటిని అప్పజెప్పడంలో మాత్రం ఎప్పుడూ వెనకబడిపోయేవాడట.

Telugu Daksh Singh, Eye, India, Kid Superpower, Rare, Eyes, Unique, Bengal Boy-L

సదరు విషయాలు అతని చిన్నప్పుడే గమనించిన తల్లి అర్చన సింగ్ చాలా ప్రత్యేకమైన కేర్ తీసుకుంది.న్యూరో-లింగ్విస్టిక్ ప్రాక్టీషనర్‌గా పని చేస్తున్న ఆమె తన కొడుకులో ఉన్న సమస్యను తీర్చేందుకు సంస్కృతం నేర్పింది.ధ్యానంతో పాటు ట్రీట్‌మెంట్ ఇప్పించడంతో అతనిలోని మేధాశక్తి వికసించింది అని చెప్పుకొచ్చింది.కట్ చేస్తే దక్ష్ తనకున్న మెమరీ పవర్, తెలివి తేటలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

అతగాడు చూడకుండా ఒక్క నిమిషంలో పుస్తకంలోని పేర్లు, విభాగాలు, అంకెలు, లెక్కలను సైతం చూడకుండా టక్కున చెప్పేస్తాడు.అంతేకాకుండా అతగాడు తన ఎదుట వున్న మనుషులను కూడా కళ్ళు మూసుకొని గుర్తు పట్టగలడట!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube