సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సిక్కులపై విద్వేష నేరాలు ఎక్కువవుతున్నాయి.ఇటీవలి కాలంలో పలు సంస్థలు విడుదల చేసిన నివేదికల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలో యూదుల తర్వాత అత్యధికంగా విద్వేష నేరాలకు గురయ్యేది సిక్కులేనట.
ఇకపోతే.నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరానికి చెందిన సిక్కు సంఘం ప్రతినిధులు ఇటీవల అమెరికాలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను కలిశారు.ఈ సందర్భంగా సిక్కు కమ్యూనిటీపై పెరుగుతున్న ద్వేషపూరిత చర్యలను ఎదుర్కోవడానికి సహాయం చేయాల్సిందిగా వారు కోరారు.
షార్లెట్‌లోని గురుద్వారా ఖల్సా దర్బార్‌లో ఆదివారం న్యాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యక్రమంలో సిక్కు ప్రతినిధులు తమపై జరుగుతున్న దాడుల గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ద్వేషపూరిత నేరాలు, పౌరహక్కుల ఉల్లంఘనలను విచారించడంలో అనుభవం వున్న అసిస్టెంట్ యూఎస్ అటార్నీలు, ఎఫ్‌బీఐ, షార్లెట్ మెక్లెన్‌బర్గ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా.ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించిన గణాంకాల ప్రకారం.2021లో మతానికి సంబంధించి 1005 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.అయితే అత్యధికంగా లక్ష్యంగా చేసుకున్న మత సమూహాల్లో ఒకరిగా సిక్కులు నిలిచారు.2018లో ఎఫ్‌బీఐకి అందిన ఫిర్యాదుల్లో సిక్కులపై జరిగిన ద్వేషపూరిత నేరాలు 60 కాగా.2020లో ఈ సంఖ్య 89కి పెరిగింది.2021లో అత్యధికంగా 214కు చేరడం సమస్య తీవ్రతగా అద్ధం పడుతోంది.విద్వేష నేరాలకు సంబంధించి 2018లో అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులు వుండేవారు.
అయితే ఇప్పుడు అనూహ్యంగా సిక్కులు రెండవ స్థానంలోకి చేరారు.ఎఫ్‌బీఐ ప్రకారం.
అమెరికాలో ఇతర మతాలకు వ్యతిరేకంగా 91 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.ఇందులో హిందువులపై 12, బౌద్ధులపై 10 నేరాలు జరిగాయి.