పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారా.? బీజేపి గ్రాఫ్ పడిపోవడమే అందుకు కారణమా.? ఇప్పుడు పవన్ రూటు ఎటు.? ఇప్పుడు ఈ ప్రశ్నలు పవన్ అభిమానులని ఏపీ ప్రజలని వేదిస్తున్నాయి.ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు సాక్షాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.పవన్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది అనేట్టుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకుంటారా అనే విషయాలని కాసేపు పక్కకి పెడితే.
ఆదివారం మీడియాతో చినరాజప్ప మాట్లాడారు ఈ సందర్భంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు సైతం చేయడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న తేడాను కూడా ఆయన చెప్పారు.ఎన్టీఆర్ అయితే నిర్ణయాన్ని తొందరగా తీసుకుంటారని, చంద్రబాబు అయితే ఆలోచిస్తారని చెప్పారు.అందరూ మన మనుషులే, మనతో ఉన్నారు.నచ్చ చెప్పాలని చంద్రబాబు చూస్తారని వ్యాఖ్యానించారు.
బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని ఈ విషయం ఇప్పటికే తెలుస్తోందని.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపి ఘోరమైన పరాభవం చెందడం ఖాయమని అన్నారు.ఇప్పటికే బీజేపి అన్ని రాష్ట్రాలో వ్యతిరేకతని మూట గట్టుకుందని సాక్షాత్తు బీజేపి సర్వేలలో ఆ నిజం వేల్లడయ్యిందని అన్నారు.
ఈ దశలోనే వన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు.అయితే ఇప్పటికే వైసీపి అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ కంట్రోల్‌లో ఉన్నారని.
బీజేపి ఉచ్చులో నుంచీ పవన్ కళ్యాణ్ బయటకి రావడానికి సిద్దంగా ఉన్నారని రాజప్ప చెప్పడం షాక్ కి గురిచేస్తోంది.
బీజేపీతో వెళ్తే తాను కూడా మునిగిపోతానని పవన్ కళ్యాణ్ భావించారని, ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు.
అయితే చినరాజప్ప ప్రకటన తరువాత మీడియా వర్గంలో కానీ టీడీపీ పార్టీ లో కానీ పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకునే అవకాసం కూడా ఉందనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.అంతేకాదు ఏపీ లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారని చినరాజప్ప చెప్పారు.
ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు ఆరా తీస్తున్నారన్నారు…అయితే చినరాజప్ప చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన నుంచీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం.