ఏపీకి బీజేపీ అగ్రనేతలు పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తిరుపతికి చేరుకున్నారు.
మధ్యాహ్నం తిరుపతి పార్లమెంట్ జిల్లా బీజేపీ సదస్సుకు జేపీ నడ్డా హాజరుకానున్నారు.తరువాత శ్రీకాళహస్తికి వెళ్లనున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
సాయంత్రం శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు.అదేవిధంగా రేపు విశాఖకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.
ఈ క్రమంలో రేపు సాయంత్రం రైల్వే గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.అనంతరం బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం అవుతారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనను బీజేపీ నేతలు వివరించనున్నారు.