తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారు.ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ మేరకు ఈనెల 15న జిల్లాలో పర్యటించనున్న అమిత్ షా భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.ముందుగా శంషాబాద్ రానున్న అమిత్ షా అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో భద్రాచలం చేరుకోనున్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఖమ్మం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.అనంతరం బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.
ఈ మేరకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.దాంతో పాటు సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.