భారతీయ వ్యక్తులు లేదా భారతీయ సంతతి వ్యక్తుల ప్రతిభ అనన్యసామాన్యమైనది.ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ భారతీయ జెండా గుర్తుగా మన ప్రతిభని చూపించి చాటి చెప్పి మరీ వస్తారు.
అందుకే అమెరికాలో ఇండియన్స్ ఎదుగుదలని తట్టుకోలేని ట్రంప్ వీసాల వంకతో వెనక్కి పంపేయాలని భావిస్తున్నాడు సరే ఇక అసలు విషయంలోకి వెళ్తే.అమెరికాలోని న్యూయార్క్‌లో వరల్డ్ మేకర్ ఫెయిర్-2018 జరిగింది.
ఈ వరల్డ్ మేకర్ ఫెయిర్-2018లో ఏపీ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులు సత్తాచాటారు…ఈ నెల 22, 23వ తేదీల్లో న్యూయార్క్ హాల్ ఆఫ్ సైన్స్‌లో నిర్వహించిన వరల్డ్ మేకర్ ఫెయిర్‌లో వారు రూపొందించిన రెండు రోబోలను ప్రదర్శించారు…వాటిలో కొన్నివరల్డ్ ఫెయిర్ లో హైలెట్ గా నిలిచాయి.కోళ్ల ఫారమ్‌లో కోళ్ల పెరుగుదలకు ఉపయోగపడే ఎంటర్‌టైన్‌మెంట్ రోబోతో పాటు ఇటుకలను ఒక ప్రదేశం నుంచి మరోచోటుకి తరలించే అటానమస్ బ్రిక్ క్యారీయింగ్ రోబోను ప్రదర్శించారు.
అయితే ఈ ఫెయిర్‌లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 45 దేశాల నుంచీ విద్యార్థులు పాల్గొన్నారు…ఈ ప్రదర్శన అనంతరం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును విద్యార్థులు కలిశారు.ఫెయిర్ లో జరిగిన విశేషాలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.