ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం బ్రిటన్‌ను సందర్శించారు.రష్యా తమ దేశంపై దండయాత్ర ప్రారంభించిన సంవత్సరం దాటిన తర్వాత ఆయన ఈ కీలక పర్యటన చేపడుతున్నారు.
ముఖ్యంగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎంపికైన తర్వాత ఆయన చేపడుతున్న మొదటి పర్యటన ఇది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ వెలుపల అతని రెండవ పర్యటన యూకేలో చేపడుతున్నారు.యూకే ప్రధాన మంత్రి రిషి సునక్‌తో జెలెన్ స్కీ చర్చలు జరిపారు.పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారని, U.K మిలిటరీ చీఫ్‌లను కలుస్తారని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.
ఉక్రెయిన్‌కి అతి పెద్ద సైనిక మద్దతుదారులలో బ్రిటన్ కూడా ఒకటి.ఉక్రెయిన్ దేశానికి 2 బిలియన్ పౌండ్ల ($2.5 బిలియన్) కంటే ఎక్కువ ఆయుధాలు, సామగ్రిని బ్రిటన్ పంపింది.ఉక్రేనియన్ పైలట్‌లకు “NATO-స్టాండర్డ్ ఫైటర్ జెట్‌ల”పై శిక్షణ ఇస్తుందని ఇటీవల బ్రిటన్ ప్రధాని సునక్ ప్రకటించారు.కొన్ని రోజుల క్రితమే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఉక్రెయిన్‌లో పర్యటించారు.
ఆ తర్వాత జెలెన్ స్కీ కూడా బ్రిటన్ లో పర్యటిస్తున్నారు.ఉక్రెయిన్ మిలిటరీకి బ్రిటిష్ యుద్ధ విమానాలను అందించడం ఆచరణాత్మకం కాదని యూకే చెబుతున్నప్పటికీ, జెట్‌లను పంపాలని ఉక్రెయిన్ తన మిత్రదేశాలను కోరింది.యూకేలోని స్థావరాలలో 10,000 కంటే ఎక్కువ మంది ఉక్రేనియన్ సైనికులు కూడా శిక్షణ పొందారు.కొందరు బ్రిటన్ పంపుతున్న ఛాలెంజర్ 2 ట్యాంకులపై శిక్షణ పొందారు.దాడి ప్రారంభమైన రెండు వారాల తర్వాత మార్చిలో మిస్టర్ జెలెన్స్కీ U.K పార్లమెంట్‌లో వర్చువల్‌గా ప్రసంగించారు.అతను రెండవ ప్రపంచ యుద్ధ నాయకుడు విన్‌స్టన్ చర్చిల్ ప్రసిద్ధ నినాదం “ఎప్పటికీ లొంగిపోవద్దు” ప్రసంగాన్ని గుర్తు చేశారు.ఉక్రేనియన్లు “సముద్రంలో, గాలిలో చివరి వరకు పోరాడుతారని ప్రతిజ్ఞ చేశారు.ఎంత ఖర్చయినా మా భూమి కోసం పోరాటం కొనసాగిస్తాం.” అని వెల్లడించారు.