వివాదాస్పద మతప్రచారకుడు డా.జకీర్ నాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన మత ప్రసంగాలతో ముస్లిం యువతని ఉగ్రవాదం వైపు మల్లిస్తున్నాడు అనే ఆరోపణలతో అతని మీద భారత ప్రభుత్వం నిషేధం విధించింది.దాంతో ముస్లిం దేశాలలో తల దాచుకుంటూ తన మత పచారం చేసుకుంటున్న అతని వీడియోల మీద ఇండియాలో నిషేధం ఉంది.
వివాదాస్పద మత ప్రచారకుడుగా ఉన్న అతను తాజాగా మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.కశ్మీర్‌కు
గత సెప్టెంబర్ తన వద్దకి ఒకరోచ్చారు మోదీ, అమిత్ షాలు తనని పంపించారని తెలిపాడు.
నేను భారత్‌కు తిరిగి రావడానికి ఒక అవకాశం ఉందని చెప్పాడు.నా ద్వారా ముస్లిం దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలను పిటిష్ఠం చేసుకుంటామని చెప్పాడు.
అయితే దీనికి ప్రతిగా అర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలపాలని కోరాడు.అయితే ఈ ఆఫర్ ని నేను తిరష్కరించాను అని జకీర్ నాయక్ వ్యాఖ్యానించారు.
అయితే ఇదంతా కేవలం జాకీర్ నాయక్ కుట్రపూరితంగా మోడీని దేశ ప్రజల ముందు దోషిగా తేల్చడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని, అందులో వాస్తవం లేదని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.అయిన ఒక దేశ ద్రోహి, ముస్లిం యువతని ఉగ్రవాదులుగా మార్చే వ్యక్తి ఇలాంటి మాటలు చెబితే ఇండియాలో ఎవరు విశ్వసించే పరిస్థితిలో లేరని అంటున్నారు.