బీఆర్ఎస్ పై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజా ప్రస్థానం యాత్రలో బీఆర్ఎస్ కావాలనే అలజడి సృష్టిస్తోందన్నారు.
ప్రజల పక్షాన పోరాడుతుంటే అడ్డుకునే కుట్ర జరుగుతోందని షర్మిల ఆరోపించారు.మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను విమర్శించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రశ్నిస్తే యాత్రను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.దాడులకు భయపడేది లేదన్న షర్మిల ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
తన ఆరోపణల్లో తప్పుంటూ ప్రత్యక్షంగా అడగొచ్చని వెల్లడించారు.