జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పూర్తి విషయంలోకి వెళ్తే మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15వ తారీకు విశాఖ గర్జన పేరిట వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించడానికి రెడీ అయింది.
దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ పలు ప్రశ్నలు వేస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టు ఇంకా ఫీజు రియంబర్స్ మెంట్, కౌలు రైతు సమస్యలు, నిరుద్యోగం, నిధుల మళ్లింపు, ఎర్రచందనం అక్రమ రవాణా, విద్యుత్ చార్జీల పెంపు, రోడ్లు సమస్య, చెత్త పన్ను ఇంకా కొన్ని విషయాలపై జగన్ ని ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు.
దీంతో పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు వైసీపీ మంత్రులు తమదైన శైలిలో సోషల్ మీడియాలో కౌంటర్ లు వేస్తున్నారు.‘దత్త తండ్రి చంద్రబాబు తరుపున దత్త పుత్రుడి పవన్ కళ్యాణ్ మియావ్ మియావ్.!’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.‘ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు అర్థమవుతుందా అంటూ మంత్రి అంబాటి రాంబాబు కౌంటర్ వేయడం జరిగింది.