ఒక రీజియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన హీరోగా బాహుబలి మంచి పేరు దక్కింది ఇదే బాటలో 50 కోట్ల మార్కెట్ కూడా లేని కన్నడ హీరో యష్( Yash ) తన కెజిఎఫ్ సినిమాతో( KGF ) 1000 కోట్ల మార్కెట్ ను సృష్టించుకున్నాడు.ఈ సినిమా రెండు పాటలుగా విడుదలై బాహుబలికి పోటీగా ట్రిపుల్ ఆర్ కి దీటుగా నిలబడి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.
అయితే అసలు సమస్య అంతా ఇక్కడే వచ్చింది.ఏదో ఒక సినిమా తీయడం పెద్ద విషయం కాదు కానీ కలెక్షన్స్ తో కోట కట్టుకున్న కట్టుకున్న వాత మళ్లీ ఆ రేంజ్ కలెక్షన్స్ రాకపోతే ఎక్కడ నుంచి ఎక్కారో అక్కడి నుంచి కిందకు పడిపోవాల్సి వస్తుంది.
అందుకే కేజిఎఫ్ సీక్వెల్( KGF 2 ) విడుదలై దాదాపు ఏడాది గడుస్తున్నా కూడా మరొక సినిమాకు సంబంధించిన ప్రకటన చేయడానికి యశ్ ఆలోచిస్తున్నాడు.గతంలో సైతం ప్రభాస్( Prabhas ) బాహుబలి సినిమాతో( Bahubali ) ఎంతో ఎత్తుకు ఎదిగాడు కానీ ఆ తర్వాత ఆయన తీసిన అన్ని సినిమాలు కూడా పరాజయం ఫాల్ అవ్వడం మనం కల్లారా చూస్తూనే ఉన్నాం.అందుకే ఏది పడితే అది తీసే ఉద్దేశం లేనట్టుగా యశ్ వైఖరి చూస్తే అర్థమవుతుంది.ఒక తమిళ డైరెక్టర్ చెప్పిన మాఫియా కథ( Mafia Story ) నచ్చడంతో అది చేసే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తోంది అంతేకాదు బాలీవుడ్ లో తీస్తున్నారు రామాయణంలో( Ramayanam ) రణ్ బీర్ కపూర్ మరియు సాయి పల్లవి సీతా, రాముడిగా నటిస్తుండగా అందులో ముఖ్యమైన పాత్రలో యశ్ నటిస్తున్నాడని వార్త కూడా వస్తుంది.
మొత్తానికి యశ్ ఏది పడితే అది తీసే అవకాశాలు అయితే కనిపించడం లేదు.తీసే సినిమా ఖచ్చితంగా అతని మార్కెట్ ను కన్నడ సినిమా స్టాండర్డ్ ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఉండాలని కాస్త సమయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది పాటించాల్సిందిగా యశ్ కోరుకుంటున్నాడు సోషల్ మీడియాలో తగినంత టైం కూడా తన అభిమానుల కోసం తీసుకుంటున్నాడు.ఈసారి 1000 కోట్ల మార్కెట్ దాటి రేంజ్ సినిమా తీస్తాడో మరికొన్ని రోజులు ఆగితే గాని తెలిసే అవకాశం కనిపించడం లేదు.