ఆ సినిమాకు నిర్మాతగా మారబోతున్న యశ్.. రామాయణానికి మనసులో స్థానం ఉందంటూ?

సాధారణంగా వరుసగా రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే ఏ హీరో అయినా వేగంగా సినిమాలు చేసి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటారనే సంగతి తెలిసిందే.అయితే యశ్ మాత్రం నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.కేజీఎఫ్2( KGF2 ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్( yash ) ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నారు.భారీ క్యాస్టింగ్ తో, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 Yash Comments About Ramayanam Movie Details Here Goes Viral In Social Media , So-TeluguStop.com

గత కొంతకాలంగా నితీష్ తివారి ( Nitish Tiwari )డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణం( Ramayanam ) ప్రాజెక్ట్ లో యశ్ నటిస్తున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఈ వార్తల గురించి యశ్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనుందని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి యశ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Kgf, Namit Malhotra, Nitish Tiwari, Ramayanam, Yash, Yash Ramayanam-Movie

నాకు ఎప్పటినుంచో మన భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై ఉంచాలనేది కల అని వెల్లడించారు.నేను, నమిత్ మల్హోత్ర( Namit Malhotra ) రామాయణం ప్రాజెక్ట్ ను నిర్మించాలని చాలాసార్లు అనుకున్నామని చెప్పుకొచ్చారు.అంత పెద్ద ప్రాజెక్ట్ కావాలంటే భారీ సైజ్ లో ఖర్చు అవుతుందని అందుకే నేను ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం అయ్యానని యశ్ పేర్కొన్నారు.రామాయణానికి నా మనస్సులో మంచి స్థానం ఉందని యశ్ తెలిపారు.

Telugu Kgf, Namit Malhotra, Nitish Tiwari, Ramayanam, Yash, Yash Ramayanam-Movie

రామాయణం కోసం నేను ఎంతైనా కష్టపడతానని యశ్ చెప్పుకొచ్చారు.నితీష్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని ఆయన అన్నారు.యశ్ నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.యశ్ ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తారో చూడాల్సి ఉంది.యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube