ఆ సినిమాకు నిర్మాతగా మారబోతున్న యశ్.. రామాయణానికి మనసులో స్థానం ఉందంటూ?

సాధారణంగా వరుసగా రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే ఏ హీరో అయినా వేగంగా సినిమాలు చేసి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటారనే సంగతి తెలిసిందే.

అయితే యశ్ మాత్రం నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.కేజీఎఫ్2( KGF2 ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్( Yash ) ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నారు.

భారీ క్యాస్టింగ్ తో, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.గత కొంతకాలంగా నితీష్ తివారి ( Nitish Tiwari )డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణం( Ramayanam ) ప్రాజెక్ట్ లో యశ్ నటిస్తున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

ఈ వార్తల గురించి యశ్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.తన సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ గురించి యశ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. """/" / నాకు ఎప్పటినుంచో మన భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై ఉంచాలనేది కల అని వెల్లడించారు.

నేను, నమిత్ మల్హోత్ర( Namit Malhotra ) రామాయణం ప్రాజెక్ట్ ను నిర్మించాలని చాలాసార్లు అనుకున్నామని చెప్పుకొచ్చారు.

అంత పెద్ద ప్రాజెక్ట్ కావాలంటే భారీ సైజ్ లో ఖర్చు అవుతుందని అందుకే నేను ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం అయ్యానని యశ్ పేర్కొన్నారు.

రామాయణానికి నా మనస్సులో మంచి స్థానం ఉందని యశ్ తెలిపారు. """/" / రామాయణం కోసం నేను ఎంతైనా కష్టపడతానని యశ్ చెప్పుకొచ్చారు.

నితీష్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని ఆయన అన్నారు.యశ్ నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

యశ్ ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తారో చూడాల్సి ఉంది.యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రీల్స్ పిచ్చి.. రీల్స్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్స్.. దెబ్బకి?