Rishabh Shetty Rashmika: అబ్బా.. రష్మిక పరువు తీసేసిన రిషబ్ శెట్టి.. మీడియా ముందే అలాంటి కామెంట్స్?

కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది.చాలావరకు అవి బయటపడవు కానీ ఏదైనా సందర్భం వస్తే మాత్రం ఇన్ డైరెక్ట్ కామెంట్ల వారి మధ్య కోల్డ్ వారు జరుగుతుందన్నట్లు అర్థమవుతుంది.

 Wow Rishabh Shetty Defamed Rashmika Such Comments Before The Media, Rishabh Shet-TeluguStop.com

ఇప్పుడు అటువంటి కోల్డ్ వారే కన్నడ స్టార్ డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి, రష్మిక మందన మధ్య జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటో.

అసలు వారి మధ్య ఏం జరిగిందో అనే విషయం తెలుసుకుందాం.కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఈమె తొలిసారిగా కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా నటిగా పరిచయమైంది.ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా బాగా అవకాశాలు వచ్చాయి.

దీంతో ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా బాగా పరుగులు తీసుకుంటూ వచ్చింది.

చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మారింది.

అయితే ఆమె తొలిసారిగా నటించిన కిరిక్ పార్టీ అనే సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరో కాదు.ఇటీవలే కాంతార సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందనకు మొదటిసారి ఛాన్స్ ఇచ్చాడు రిషబ్ శెట్టి.ఆరోజు ఆయన ఆమెకు అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టే ఇప్పుడు ఈమె ఈ స్టేజ్ లో ఉంది.

ఇక ఆయన రష్మికకు అటువంటి గుర్తింపు ఇచ్చినప్పుడు కనీసం ఆయన సినిమాను చూడటానికి కూడా సమయాన్ని కేటాయించలేదు రష్మిక మందన.కాంతార సినిమాతో సామాన్యులనే కాదు టాలీవుడ్ నటీనటులను కూడా మెప్పించాడు రిషబ్ శెట్టి.

చాలావరకు టాలీవుడ్ నటీనటులు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు.

కానీ రష్మిక మందన మాత్రం తనకు ఈ సినిమా చూడటానికి సమయం లేదని చెప్పటంతో ఈమెపై బాగా ట్రోల్స్ వచ్చాయి.

అంతేకాకుండా ఆమెను బాగా విమర్శించారు కూడా.పైగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె ఫస్ట్ ఛాన్స్ వచ్చింది తన అందం చూసి అని తెలిపింది.

నిజానికి తన ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది రిషబ్ శెట్టి.కానీ ఆయన పేరు చెప్పకుండా తన అందాన్ని ముందు పెట్టేసింది రష్మిక.

దీంతో రిషబ్ శెట్టి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రష్మికకు తగిలే విధంగా కౌంటర్ ఇచ్చి పరువు తీశాడు.ఆ ఇంటర్వ్యూలో తనకు సమంత, సాయి పల్లవి, రష్మిక లలో ఎవరితో తర్వాత సినిమా చేయాలనుకుంటున్నారు అని ప్రశ్న ఎదురవటంతో వెంటనే ఆయన రష్మికను టార్గెట్ చేస్తూ.

కొంతమంది హీరోయిన్స్ తో అస్సలు పని చేయాలనుకోవడం లేదు అని.సమంత, సాయి పల్లవిలో పనితనం మాత్రం తనకు ఇష్టమని అన్నాడు.

ఇక రష్మిక మందన పేరు చెప్పకుండా కొత్త హీరోయిన్స్ తో పని చేయాలనుకుంటున్నాను అంటూ రష్మిక పరువు తీసే విధంగా మాట్లాడుతూ ఆమె సిగ్నేచర్ హాండ్స్ ని చూపిస్తూ కౌంటర్ ఇచ్చాడు రిషబ్ శెట్టి.ఇక ఇదంతా చూస్తే వీరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది.

Rishab Shetty Comments on Rashmika Mandanna

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube