సాధారణంగా ప్రజలు తమలోని ప్రత్యేక టాలెంట్‌ను బయట పెట్టాలని చాలా కుతూహల పడుతుంటారు.అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ప్రత్యేక టాలెంట్లను చూపించడానికి వేదికగా మారింది.
దీంతో ప్రజలు తమ ప్రతిభను చక చకా బయట పెట్టేస్తున్నారు.అయితే ఒక్కోసారి ప్రతిభను చూపించే సమయంలో పొరపాట్లు జరిగి వారు నవ్వుల పాలవుతున్నారు.
తాజాగా ఒక అమ్మాయి కూడా అంతే నవ్వుల పాలవుతోంది.ఈ యువతి చైర్ పై తన బ్యాలెన్స్ స్కిల్స్ ప్రదర్శించాలనుకుంది కానీ అది బెడిసి కొట్టడంతో ముఖం పచ్చడి పచ్చడి అయ్యింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి కుర్చీ బ్యాలెన్సింగ్ స్టంట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు.ఈ వీడియోలో మొత్తం రెండు కుర్చీలు కనిపించాయి.వాటిని ఒకటి వెనుక ఒకటి ఉంచి ఈ యువతి వాటిపై స్టంట్ చేసింది.
ఆమె మొదటి కుర్చీపై అడుగు పెట్టి దాని మీద నుంచి విజయవంతంగా ముందుకు వెళ్ళింది.మరొకదానిపైకి వచ్చేలా మొదటి కుర్చీని బాగానే ఉంచింది.ఇంతవరకు అంతా బాగనే ఉంది.
ఆమె మరో కుర్చీని తేలికగా కిందికి వచ్చి దిగబోతుండగా రాంగ్ స్టెప్ వేసింది.వీడియోలో హీరోయిన్‌లా కనిపించేలా ఈ ముద్దుగుమ్మ ఫోజులు ఇవ్వడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది.దాంతో బ్యాలెన్స్ కోల్పోయి చాలా వేగంగా ఫ్లోర్ పై పడిపోయింది.
దీంతో ఆ యువతకి బాగానే దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.ఈ వీడియో చివరిలో ట్రోలింగ్ చేస్తూ మొహం పచ్చడి అయి రక్తం రసంలా మొహానికి మొత్తం అంటుకున్నట్లు మీమ్‌తో చూపించారు.
దీన్ని చూసి చాలా మంది నవ్వేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా లుక్కేయండి.