తెలంగాణలో జనసేన ప్రభావం ఉంటుందా ?

జనసేన పార్టీ( Janasena party ) స్థాపించి పదేళ్ళు దాటినప్పటికి ఏపీ వరకే పరిమితం చేశారు అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan kalyan ) .కానీ ఏపీలో కూడా ఇంకా బలం పెంచుకునే స్టేజ్ లోనే ఉంది.

 Will There Be Influence Of Janasena In Telangana Details, Political News,janasen-TeluguStop.com

అయితే పవన్ కల్యాణ్ కు కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణలో( Janasena in telengana ) కూడా అఖండ అభిమానఘనం ఉంది.దీంతో జనసేన పార్టీని తెలంగాణలో కూడా బరిలో నిలపాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఏపీనే తన మొదటి ప్రదాన్యత అని గతంలోనే పవన్ సార్లు చెప్పుకొచ్చారు.కానీ ఈసారి ఎన్నికల్లో ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణలో కూడా జనసేనను నిలిపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Janasena, Janasenaenter, Jenasena, Pawan Kalyan-Politics

ఇప్పటికే గ్రాండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట.ఇక త్వరలోనే ఏపీలో ప్రారంభం కానున్న వారాహి యాత్రను తెలంగాణలో( Varahi Yatra in Telangana ) కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారట పవన్ కల్యాణ్.దీంతో ఇప్పుడు అందరిలోనూ ఒకటే చర్చ జనసేన తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుంది ? జనసేన ఎంట్రీతో ఎలాంటి సమీకరణలు మారనున్నాయి ? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.ప్రస్తుతం తెలంగాణలో బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్( BRS, BJP and Congress in Telangana ) మద్య రసవత్తరమైన పోరు నడుస్తోంది.

ఇప్పుడు జనసేన ఎంట్రీతో కొత్త లెక్కలు తెరపైకి వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Janasena, Janasenaenter, Jenasena, Pawan Kalyan-Politics

అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా ? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనే దానిపై స్పష్టత లేదు గాని, పవన్ కు ఇటు బి‌ఆర్‌ఎస్ అటు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి, కే‌సి‌ఆర్ తోను కే‌టి‌ఆర్ తోను పవన్ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు పవన్.దీంతో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ తో కలిసి జనసేన పోటీ చేస్తుందా ? లేదా ఏపీలో ఆల్రెడీ బీజేపీతో జనసేన పొత్తులో ఉంది.మరి ఇదే దోస్తీని తెలంగాణలో కూడా కొనసాగిస్తుందా ? అనేది చూడాలి.మొత్తానికి పవన్ ఎంట్రీతో ఇంతవరుకు గెలుపు విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంటూ వస్తున్న బి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఇప్పుడు కొత్త అనుమానాలు చుట్టుముట్టాయి.మరి వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఇతర పార్టీలపై ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube