రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ పట్టణంలో బిఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు( Chalmeda Lakshminarasimha Rao ) కార్యాలయాన్ని ప్రారంభించారు.దాదాపు 500 మంది కార్యకర్తలు అభిమానుల మధ్య కార్యాలయం ప్రారంభమైంది.
నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూఈ ప్రాంత ప్రజలకు మరింత అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందించాలని ఉద్దేశంతో కార్యాలయాన్ని ప్రారంభించినట్లుగా వెల్లడించారు.
చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా మరింత సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది .రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో బి ఆర్ ఎస్ పార్టీ ఆదేశిస్తే వేములవాడ అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి సిద్దం అని చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.హాజరైన నియోజకవర్గ చుట్టూ పక్కల ఊర్ల ప్రజలు, స్థానిక నాయకులు, ఏఎంసీ చైర్మన్ ప్రభాకర్ రావు, సహకార సంఘాల అధ్యక్షులు బండ నరసయ్య యాదవ్, జలగం కిషన్ రావు, రామ్మోహన్ రావు, మాజీ జెడ్పి చైర్మన్ తీగల రవీందర్ గౌడ్, మాదాడి గజానంద రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లైసెట్టి మల్లేశం, నిమ్మశెట్టి విజయ్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు







