ఏపీలో ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా ఇప్పటినుంచే రాజకీయం వేడెక్కుతోంది.అసంతృప్తులు.
ఆశావహులు.వర్గపోరు వంటివి బయటకు వస్తున్నాయి.
ఇక జంపింగ్ లు కూడా ఉండనున్నాయి అయితే ఏపీ రాజకీయాల్లో కీలకమైన ప్రాంతం విజయవాడ.ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ.
ఆసక్తిగానే ఉంటున్నాయి.అధికారంలో ఉన్న పార్టీలకు.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా ఈ నగరం కీలకమే.గత రెండు ఎన్నికలను చూసుకున్నా వైసీపీ టీడీపీలకు.అనుకూలంగానే ఇక్కడ ప్రజ లు విజయాలను అందించారు.2014లో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిస్తేఒక చోట నుంచి వైసీపీ విజయం దక్కించుకుంది.అప్పటి ఎన్నికల్లో సెంట్రల్ తూర్పు టీడీపీ ఖాతాలో పడ్డాయి.పశ్చిమ నియోజకవర్గం వైసీపీ చేజిక్కించుకుంది.
గత ఎన్నికల్లో ఇలా.
అయితే 2019 నాటికి వచ్చేసరికి.
తూర్పు నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ విజయం దక్కించుకోగా వై సీపీ పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గం దక్కించుకుంది.ఇలా మొత్తంగా రెండు పార్టీలను విజయవాడ ప్రజలు ఆదరిస్తున్నారు.
ఇక ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి.ఏ నాయకులు ఎటు మారతారో.
కూడా తెలియని పరిస్థితి.గత ఎన్నికల్లోనూ ఇలాంటి సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి.
అప్పటి వరకు వైసీపీలో ఉన్న వంగవీటి రాధా టీడీపీలోకి జంప్ చేశారు.అప్పటి వరకు టీడీపీలో ఉన్న యలమంచిలి రవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే జలీల్ఖాన్ టీడీపీలోకి వచ్చేశారు.దీంతో విజయవాడ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది.
ఇక ఇప్పుడు కూడా భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.ముగ్గురు నలుగురు కీలక నేతలు పార్టీలు మారేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వంగవీటి రాధా యలమంచిలి రవి
అయితే ఈ పరిణామాలన్నీ వినాయక చవితి అయిపోయిన వెంటనే ఉపందుకోనున్నట్లు తెలుస్తోంది.వీరిలో ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.అదేవిధంగా కీలకమైన వంగవీటి రాధా తిరిగి వైసీపీ గూటికి వచ్చే ఛాన్స్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఇక టీడీపీ ఎంపీ కేశినేని నాని.తన కుమార్తె సహా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్.అలాగే పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పటి వరకు అండగా ఉన్న కొందరు నాయకులు పోతిన మహేష్ సారథ్యంలో జనసేన బాటపట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మొత్తానికి బెజవాడ రాజకీయాలు పండగ తర్వాత వేడెక్కనున్నాయి.