నటి శ్రీవిద్య( Srividya )ఈమె గురించి కొత్తగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.500 కు పైగా సినిమాలో అనేక భాషల్లో హీరోయిన్ గా నటించింది.కేవలం కళ్ళతోనే నటిస్తూ ఆమె సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను సంపాదించుకొని ఒక మహానటిగా వెలుగు వెలిగింది.బాలనటిగా ఆమె తొలి ప్రయాణం మొదలయ్యి చివరికి తల్లి పాత్రలతో ఆమె సినీ ప్రయాణం ముగిసింది.
ఇక శ్రీవిద్య 2006లో రొమ్ము క్యాన్సర్ తో కన్ను మూసింది.ఆమె హీరోయిన్గా చలామణి అవుతున్న టైంలో కమల్ హాసన్ తో ప్రేమలో పడిన విషయం కూడా మనకు తెలుసు.
కానీ వీరి పెళ్లి జరగకపోవడానికి గల కారణం మాత్రం అందరూ కమల్ వల్లే అనుకుంటారు.
అయితే ఈ విషయానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను శ్రీవిద్య అన్న భార్య అయిన విజయ లక్ష్మి( Vijaya Lakshmi ) ఇటీవల ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.కమల్, శ్రీవిద్య ప్రేమలో పడిన మాట వాస్తవమే అయినా శ్రీవిద్య కమల్ హాసన్ ని ప్రేమించిన టైంకి కమల్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నారట.
అయితే ఆ టైంలో వీరిద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించడంతో కమల్ హాసన్ వాణి కన్నా కూడా శ్రీవిద్య వైపు మోగ్గారని, కొన్ని రోజుల పాటు వీరి ప్రేమ చాలా హాయిగా గడిచిందని ఈ విషయం అందరికీ కూడా తెలుసని చెప్పారు.అయితే కమల్ శ్రీ విద్యతో పెళ్లి చేసుకోవాలని మొదట ప్రపోజల్ పెట్టింది మాత్రం కమల్ హాసన్( Kamal Haasan ) అట.శ్రీవిద్య అన్న శంకర్ కి ఈ విషయాన్ని చెప్పారట./br>
ఇంట్లో అందరినీ అడిగి ఒక అభిప్రాయానికి వచ్చాక కమల్ కి ఏ విషయమైనా చెబుతానని చెప్పి ఇంటికి వచ్చాక శ్రీ విద్య తల్లికి చెప్పగా ఈ విషయాన్ని ఒప్పుకోలేదట.ఎవరు ఎన్ని చెప్పినా ఈ వయసులో శ్రీవిద్యకు పెళ్లి చేయడం కుదరదని ఆమె ఇంక కొన్నాళ్ళు హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నారని మొండిగా ప్రవర్తించడంతో వారి పెళ్లి ముందుకు వెళ్లలేదు.కమల్ శ్రీ విద్య తల్లి ఒప్పుకునే వరకు కూడా ఎదురు చూస్తానని చెప్పాడట.అయినా కూడా ఈ చర్చలు ముందుకు సాగకపోవడంతో వారికి బ్రేకప్ జరిగిందని, వాణి తో పెళ్ళి కూడా జరిగిందని విజయలక్ష్మి తెలిపారు.