Baladitya Sobhan Babu: బాలాదిత్యని అలా చూసి చెలించిపోయిన శోభన్ బాబు…ఆ రోజు ఏం జరిగింది?

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు బాలాదిత్య.( Baladitya ) ఆ తర్వాత జంబలకడిపంబ, ఏవండీ ఆవిడ వచ్చింది, లిటిల్ సోల్జర్స్, సమరసింహా రెడ్డి వంటి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.చంటిగాడు సినిమాతో( Chantigadu ) హీరోగా పరిచయమయ్యాడు.సుందరానికి తొందరెక్కువ, 1940లో ఒక గ్రామం వంటి మంచి సినిమాలను కూడా చేశాడు.అయితే చిన్నతనంలో ఈ నటుడు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగాయి.వాటి గురించి బాలాదిత్య కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించాడు.

 Why Sobhan Babu Felt Emotional About Baladithya-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మూవీ షూటింగ్ సమయంలో తనకు ప్రమాదం జరిగినప్పుడు అలనాటి హీరో శోభన్ బాబు చాలా వర్రీ అయ్యారని వెల్లడించాడు.

Telugu Baladitya, Baladithya, Baladityasobhan, Chantigadu, Child Artist, Sobhan

బాలాదిత్య మాట్లాడుతూ.“శోభన్ బాబుకు( Sobhan Babu ) నేనంటే చాలా ఇష్టం.తనకి ఇద్దరు మనవళ్ళు ఉన్నారని ఎప్పుడూ నాతో చెప్తుండేవారు.

వారిలో ఒకరు శోభన్ బాబు మాట ఎప్పుడూ వినేవారు కాదట.నన్ను తీసుకెళ్లి వాళ్లకి చూపించి ‘పిల్లోడు అంటే ఇలా ప్రవర్తించాలి’ అని నేర్పిస్తా అని అంటుండేవారు.”ఒకరోజు షూట్ జరుగుతుంది.ఆ రోజు అంబర్ పౌడర్ పెట్టారు.

అదొక డెత్‌ సీన్‌,( Death Scene ) అందులో నేను చనిపోతాను.ఫస్ట్ టేక్ లో ఒకటి పేలుతుంది.

ఇంకొకటి పేలదు.నన్ను పేలని దాని చోటు నిల్చోమన్నారు కానీ పొరపాటున పేలే దాని దగ్గర నిల్చోబెట్టి పేల్చేశారు.

దాంతో ఒక్కసారిగా పౌడర్ మొత్తం ముక్కులోకి వెళ్లిపోయి స్పృహ తప్పి పడిపోయాను.ఇది చూసి శోభన్ బాబు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేసారు.

ఏమైందో ఏమో అని చూశారు.అంత పెద్ద స్టార్ ఎన్నో ఎమోషనల్ సీన్స్ చేసుంటారు.కానీ నేను చనిపోయినట్లు నటించే సన్నివేశంలో మాత్రం ఆయన బాగా డిస్టర్బ్ అయ్యారు.” అని చెప్పుకొచ్చాడు.

Telugu Baladitya, Baladithya, Baladityasobhan, Chantigadu, Child Artist, Sobhan

ఇక బాలాదిత్య మరుసటి రోజు డెత్ సీన్ చేశాడు.ఆ సన్నివేశం కోసం మొహం మీద మొత్తంగా గాయాలైనట్లు మేకప్ వేసుకున్నాడు.అయితే బాలాదిత్య శోభన్ బాబును అలా చూడలేకపోయాడట.” అరే నేను అలా చూడలేకపోతున్నా, రా.ఒకసారి ఈ సన్నివేశం అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి నన్ను కలువు.” అని శోభన్ బాబు బాలాదిత్యకు చెప్పాడు.బాలాదిత్య షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని శోభన్ బాబు ఇంటికెళ్లేసరికి రాత్రి 11 అయ్యిందట.ఆ సమయంలో శోభన్ బాబు తెల్ల బట్టలేసుకుని పెళ్ళికొడుకు లాగా, ఒక మహారాజు లాగా చాలా హ్యాండ్సమ్ గా కనిపించారని బాలాదిత్య చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత తనకు ఒక ఫ్రూట్ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు వెల్లడించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube