తెలంగాణకు కొత్త డిజిపి ఎవరో ? రేసులో ఉంది వీరే 

ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ప్రమాణస్వీకారం చేస్తున్నారు ఇక మంత్రి మండలి కొలువు తీరనుంది.ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ కూడా రానున్నారు.

 Who Will Be The New Dgp Of Telangana State Among These Details, Telangana Dgp, R-TeluguStop.com

అయితే కొత్త డిజిపిగా ఎవరిని నియమిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత డిజిపి నియామకం( Telangana DGP ) జరగనుంది.

రేవంత్ రెడ్డి ఎవరు వైపు మొగ్గు చూపుతారు అనేది తేలాల్సి ఉంది.ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీ గా ఉన్న రవి గుప్త తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు జితేందర్, రాజీవ్ రతన్,  సి.వి ఆనంద్, రవిగుప్త డీజీపీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు .అయితే ఈ నలుగురిలో ఎవరు వైపు రేవంత్ మొగ్గు చూపిస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు.  అయితే రవిగుప్త ,( Raviguptha IPS ) రాజీవ్ రతన్( IPS Rajiv Ratan ) లలో ఎవరో ఒకరికి ఈ పోస్టు దక్కే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొన్నటి వరకు తెలంగాణ డిజిపిగా ఉన్న అంజనీ కుమార్( Anjani Kumar ) ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు జరుగుతున్న సమయంలోనే డీజీపీగా ఉన్న అంజనీ కుమార్,  అదనపు డిజిపి సంజయ్ కుమార్,  సిఐడి చీఫ్ మహేష్ భగవత్ సిబిఐ కాలనీలోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే దీనిపై ఎన్నికల సంఘం( Election Commmission ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒకవైపు కౌంటింగ్ జరుగుతుండగా,  ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే రేవంత్ ను ఎలా కలుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి వీరి పై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి ఎన్నికల సంఘం సూచించింది.

Telugu Congress, Cv Anand, Ips Jithender, Ips Rajiv Ratan, Raviguptha Ips, Revan

ఈ క్రమంలో డిజిపి అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.అలాగే సంజయ్ కుమార్,( Sanjay Kumar ) మహేష్ భగవత్( Mahesh Bhagavath ) లకు నోటీసులు జారీ అయ్యాయి.ఈ క్రమంలోనే ఇన్చార్జి ఏసీబీ డిజీగా ఉన్న రవి గుప్తను ఇన్చార్జి డిజిపిగా నియమిస్తూ ఉత్తర జారి అయ్యాయి.అయితే కొత్త ప్రభుత్వం రవి గుప్తాను  కొనసాగించే అవకాశం ఉందన్నట్లుగా ప్రచారం జరుగుతుంది 1990 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ అధికారి రవిగుప్త ,పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న 1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్,

Telugu Congress, Cv Anand, Ips Jithender, Ips Rajiv Ratan, Raviguptha Ips, Revan

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ సూచనలు మేరకు బదిలీ అయిన అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ,( CV Anand ) ప్రస్తుత జైళ్ళ శాఖ డిజి హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న 1992 సంవత్సరం బ్యాచ్ అధికారి జితేందర్( Jithender ) పేర్లు కొత్త డిజిపి రేసులో వినిపిస్తున్నాయి.అయితే వీరిలో రవి గుప్త సీనియర్ కావడం వివాద రహితుడిగా పేరు ఉండడం తో ప్రస్తుత ఇంచార్జిగా ఉన్న రవి గుప్తానే పూర్తిస్థాయి డీజీపీ గా నియమించే అవకాశాలు ఉన్నట్లుగా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకవేళ రవిగుప్త కానిపక్షంలో రాజీవ్ రతన్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube