కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయకా ఆయనకు సంబంధించిన ఒక పెయింటింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.స్వర్గంలో ఉన్న తండ్రి దగ్గరకు నెమ్మదిగా వెనకాల నుంచి వెళ్లిన పునీత్.
ఆయన కండ్లు మూసి నేనూ వచ్చేశా నాన్నా.అన్నట్టుగా గీసిన చిత్రం వారిద్దరి బంధాన్ని చూపుతున్నట్టుగా ఉంది.
ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అని ప్రశంసలు కురిపిస్తూనే పునీత్ ఇక లేరనే విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు.ఆ చిత్రాన్ని చూసిన పునీత్ ఫ్యా్న్స్‌కు కన్నీరు సైతం ఆగడం లేదు.
ఈ చిత్రాన్ని కరణ్ ఆచార్య గీశారు.ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా.
కరణ్ ఆచార్య.ఆయన అసలు పేరు కిరణ్ కుమార్.ఆయన కేరళకు చెందిన ఆర్టిస్ట్.కాసర్ గోడ్ జిల్లా కుడ్లు గ్రామంలో జన్నించిన ఆయన.క్యారికేచర్స్, డిజిటల్ చిత్రాలు వేస్తుంటారు.ఫొటోస్ ఎడిట్ చేసి వాటిని అందంగా తయారు చేస్తారు.
రవివర్మ పేయింటింగ్ తనకు ఆదర్శమని ఆయన చెప్పుకుంటుంటాడు.ఆయన బాల్యం నుంచే బొమ్మలు గీసేవారు.
అయితే ఈయన గతంలో యాంగ్రీ హనుమాన్ బొమ్మ ఆయనకు ఎనలేని పేరు సంపాదించింది.దీంతో ఆయనకు హనుమాన్ చిత్రాకారుడనే పేరు వచ్చింది.
తన ఫ్రెండ్స్ కోరిక మేరకు ఆయన ఈ చిత్రాన్ని గీశారు.తన గ్రామంలోని ఆలయ ఉత్సవానికి స్పెషల్‌గా జెండాను తయారుచేశారు.
అందులో ఉంచిన హనుమంతుడి గ్రాఫిక్.సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.
చాలా మంది ఆ చిత్రాన్ని స్టిక్కర్ల రూపంలోకి మార్చుకుని వాడుకున్నారు.ఇలా ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ది బెస్ట్ గా నిలిచిపోయింది.
ఇక పునీత్ రాజ్‌కుమర్ చైల్ట్ ఆర్టిస్ట్ గా మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.చాలా సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు.ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన ఇడియట్ మూవీని అప్పు పేరుతో రిమేక్ చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత ఆయనకు వరుసగా మూవీ ఆఫర్లు వచ్చాయి.
కానీ ఇటీవలే ఆయన హార్ట్ ఎటాక్‌తో లోకాన్ని విడిచివెళ్లిన విషయం అందరికీ తెలిసిందే.