భారత్‌లో నేరాలు చేసిన ఎంతోమంది ఇక్కడ శిక్ష నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు చెక్కేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది గ్యాంగ్‌స్టర్లు, అండర్ వరల్డ్ డాన్‌లు, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ , విజయ్ మాల్యా వంటి ఆర్ధిక నేరగాళ్లు భారత్ నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.
వీరిని స్వదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.కానీ చట్టాలు, విచారణ ఇతర లాంఛనాలు ముగిసి వారిని భారత్‌కు రప్పించడం అంత తేలిక కాదు.
ఇంకొందరైతే విదేశాల్లో నేరాలు చేసి భారత్‌కు పారిపోయి వస్తున్నారు.
ఇదిలావుండగా.
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రామచంద్రన్ విశ్వనాథన్( Ramachandran Viswanathan ) తన కంపెనీ ద్వారా అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించారనే అభియోగాలపై ప్రస్తుతం పరారీలో వున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయనను గతవారం ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించింది కోర్ట్.
వివరాల్లోకి వెళితే. యూఎస్ పౌరసత్వం కలిగిన రామచంద్రన్.దేవాస్ మల్టీమీడియా( Dewas Multimedia ) వ్యవస్థాపకుడు.2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులు నమోదు చేసిన 9 మంది వ్యక్తుల్లో విశ్వనాథన్ ఒకరు.ఆయన ప్రస్తుతం అమెరికాలోని ఓమ్నీ స్పేస్ అనే శాటిలైట్ కమ్యూనికేషన్ స్టార్టప్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.అంతరిక్షం నుంచి 5జీని అందించేందుకు గాను ఉపగ్రహాల సమూహాన్ని ఒక చోటకు చేర్చేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది.
కాగా.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధ వాణిజ్య శాఖ ఆంట్రిక్స్ కార్పోరేషన్‌కు చెందిన రూ.579 కోట్లలో 85 శాతం నిధులను 2005లో రామచంద్రన్ అమెరికా( America )కు దారి మళ్లించినట్లుగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది.ఈ కేసులో భాగంగానే కోర్టు ఆయనను ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించింది.
ఇస్రో ప్రయోగించిన రెండు ఉపగ్రహాల సేవలను దేవాస్ వినియోగించుకునేలా ఇద్దరి మధ్యా ఒప్పందం జరిగింది.తదనంతర కాలంలో దేవాస్‌ను జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ లిక్విడేట్ చేసింది.
ఆపై వెను వెంటనే సీబీఐ, ఈడీలు వేరు వేరుగా కేసులు నమోదు చేశాయి.
ఇస్రో – దేవాస్ మధ్య జరిగిన శాటిలైట్ డీల్‌ను 2011లో రద్దు చేశారు.2018లో ఈ కేసులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది.అనంతరం దేవాస్, అందులో పెట్టుబడుటు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు తమకు జరిగిన నష్టాలకు పరిహారం కోరుతూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
విఫలమైన ఒప్పందానికి సంబంధించి మూడు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ ద్వారా వారికి బిలియన్ డాలర్లకు పైగా పరిహారం లభించింది.ఈ క్రమంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దేవాస్‌ను మోసపూరితంగా సృష్టించారని వాదిస్తూ 2021 మేలో లిక్విడేషన్‌కు ఆదేశించింది.
దీనిని గతేడాది సుప్రీంకోర్ట్ సైతం సమర్ధించింది.అదే ఏడాది ఆగస్టులో ఢిల్లీ హైకోర్ట్.దేవాస్, విదేశీ పెట్టుబడిదారులకు 1.2 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలన్న ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రిబ్యునల్ అవార్డ్‌ను రద్దు చేసింది.ప్రస్తుతం జరుగుతున్న విచారణకు రామచంద్రన్ సహకరించడం లేదంటూ ఈడీ తరపు ప్రాసిక్యూటర్ బెంగళూరులోని స్పెషల్ కోర్టులో వాదనలు వినిపించారు.ఆయన ప్రాపర్టీలను సీజ్ చేయాలని, ఆర్ధిక నేరస్థుడిగా ప్రకటించాలని వాదించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.విశ్వనాథన్‌కు నోటీసులు ఇవ్వడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అలాగే ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018లోని సెక్షన్ 12 కింద రామచంద్రన్ విశ్వనాథన్‌ను ఆర్ధిక నేరగాడిగా ప్రకటించింది.