తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా ఆస్తులు, అంతస్తులు, అలవాట్లు, అభిరుచులు, పోలికలు.ఇలా చాలానే వస్తుంటాయి.
అలాగే కొన్ని కొన్ని వ్యాధులు కూడా పిల్లలకు తల్లి దండ్రుల నుంచి వారసత్వంగా వస్తుంటాయి.కానీ, చాలా మందికి ఈ విషయంపై సరైన అవగాహనే ఉండదు.
అసలు ఇంతకీ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా వచ్చే వ్యాధులు ఏంటీ.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం లేదా డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి.తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే వ్యాధులు ఇదే ముందు వసరసలో ఉంటుంది.అందుకే తల్లిదండ్రులకు షుగర్ వ్యాధి ఉంటే.పిల్లలు ఖచ్చితంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
బ్రెస్ట్ క్యాన్సర్. ఇటీవల కాలంలో ఎందరినో బాధిస్తున్న సమస్య ఇది.బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి.అలాగే తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువే అనడంలో సందేహమే లేదు.
బట్టతల.ఈ పేరు వింటేనే మగవారిలో ఎక్కడాలేని ఖంగారు మొదలైపోతుంటుంది.అందులోనూ పెళ్లి కాని వారికి బట్టతల ఏర్పడితే.వారి బాధ వర్ణణాతీతం.అయితే బట్టతల దాదాపు చాలా మందికి వారసత్వంగానే వస్తుంటుంది.
హై కొలెస్ట్రాల్.
ఆహారాపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, శారీరక శ్రమ లేక పోవడం వంటి కారనాల వల్ల మాత్రమే కాదు తల్లిదండ్రుల నుంచి కూడా వారసత్వంగా వస్తుంటుంది.
తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా వచ్చే వ్యాధుల్లో మైగ్రేన్ తల నొప్పి కూడా ఒకటి.అయితే కొందరికి మాత్రం అధిక ఒత్తిడి, డిప్రెషన్, పోషకాల కొరత తదితర కారణాల వల్ల కూడా మైగ్రేన్ తల నొప్పి వస్తుంటుంది.
ఇక ఇవే కాదు రక్తపోటు, లాక్టోజ్ ఇన్ టోలరెన్స్, డిప్రెషన్, ఓబెసిటీ వంటివి కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయి.