తెలుగు సినిమాలలో హీరో సోదరి పాత్ర చాలా ముఖ్యమైనది.ఈ పాత్రలను పోషించిన కొంతమంది నటీమణులు ఇతర రంగాలలో విజయవంతమైన కెరీర్‌లను కొనసాగిస్తున్నారు.వారిలో కొందరు ఈ రోజుల్లో ఏమి చేస్తున్నాయో తెలుసుకుందాం.
సంధ్య:
ప్రేమిస్తే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంధ్య.( Sandhya ) అనంతరం అన్నవరం సినిమాలో హీరోకి చెల్లెలిగా నటించింది.ఆ తర్వాత పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది.2015లో చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి వెంకట్ చంద్రశేఖర్‌ని వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది.సంధ్య 2016లో వచ్చిన మలయాళ చిత్రం అవరుడే వీడులో కనిపించింది.
మౌనిక:
శివరామరాజులో ముగ్గురు అన్నదమ్ముల సోదరిగా మౌనిక( Mounika ) నటించింది.మా అల్లుడు వెరీ గుడ్, కొడుకు సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.2014లో మౌనిక ఇస్లాంలోకి మారి తన పేరును రహీమాగా మార్చుకుంది.2015లో చెన్నై-బేస్డ్ బిజినెస్ మాన్ మాలిక్‌ని పెళ్లాడింది.
మంజూష:
రాఖీలో ఎన్టీఆర్ చెల్లెలుగా మంజూష( Manjusha ) నటించింది.ఈ సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక ఇతర చిత్రాలలోనూ అవకాశాలు దక్కించుకుంది.అలా వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం యాంకర్‌గా వర్క్ చేస్తోంది.
దీపా వెంకట్:
మనసిచ్చి చూడు, శ్రీరామ్ సినిమాల్లో దీపా( Deepa Venkat ) నటించిన మెప్పించింది.అయితే ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో అవకాశాలు రాలేదు.దాంతో తమిళ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టి అక్కడ బుల్లితెరపై మకుటం లేని నటిగా ఎదిగింది.
తమిళంలో టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లలో ఒకరిగానూ నిలిచింది.జ్యోతిక, సౌందర్య, సిమ్రాన్, గజాలా, సంజన, విద్యాబాలన్, శ్రియతో సహా చాలా మంది హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పింది.రాజా రాణి నుంచి దాదాపు ప్రతి సినిమాలోనూ ఆమె నయనతారకు గాత్రదానం చేసింది.
శరణ్య మోహన్:
శరణ్య( Saranya Mohan ) మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.విలేజ్ లో వినాయకుడు, భీమిలి కబడ్డీ టీమ్, హ్యాపీ హ్యాపీ చిత్రాల్లో కథానాయిక నటించిన బాగా ఆకట్టుకుంది.కత్తి సినిమాలో కళ్యాణ్ రామ్ సిస్టర్ పాత్రలో పోషించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.2015లో తెలుగులో ముద్ర అనే సినిమాలో నటించిన ఈ తార అదే ఏడాది, తన చిరకాల మిత్రుడు అరవింద్ కృష్ణన్‌ను వివాహం చేసుకుంది.వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.
వర్ష:
వాసు సినిమాలో హీరోకి చెల్లెలుగా నటించింది వర్ష.( Varsha ) ఆమె అనేక చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది.ఈటీవీ సీరియల్ కురుక్షేత్రంలో హీరోయిన్‌గా కనిపించి చాలామందిని ఆకట్టుకుంది.కొంతకాలం విరామం తీసుకున్నాక మళ్లీ ఇప్పుడు ఈటీవీలో ఓ సీరియల్‌లో మెయిన్ రోల్ చేస్తోంది.
మధుమిత:
మధుమిత( Madhumitha ) పుట్టింటికి రా చెల్లి, మన్మథుడు, నువ్వే నువ్వే సినిమాల్లో సోదరి పాత్రలు పోషించే అలరించింది .స్వప్నమాధురి పేరుతో యాంకర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత తన పేరును మధుమితగా మార్చుకుంది.బిగ్ బాస్ 1 విన్నర్ శివబాలాజీని ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్‌లో ఆమె వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంది.
వాసుకి:
తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా కనిపించిన వాసుకి( Vasuki ) అదే సినిమా కోసం తాజ్ మహల్ సెట్‌ను రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమించి పెళ్లాడింది.తర్వాత సైనికుడు, యమదొంగ, పులి, గుడుంబా శంకర్, నాని, బాలు, బృందావనం వంటి అనేక చిత్రాలకు ఆనంద్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.ప్రధాన వాస్తుశిల్పిగా భువనగిరి సమీపంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కూడా ఆయన బాధ్యత వహించారు.వాసుకి సినిమాలకు విరామం ఇచ్చి ప్రస్తుతం గూగుల్‌లో మంచి ఉద్యోగం చేస్తోంది.
కీర్తి రెడ్డి:
అర్జున్ సినిమాలో కీర్తి రెడ్డి( Keerthi Reddy ) మహేష్ బాబు సోదరిగా నటించింది.ఆమె అంతకుముందు గన్ షాట్, తొలిప్రేమ సినిమాలలో హీరోయిన్ గా నటించే ఆకట్టుకుంది.కీర్తిరెడ్డి ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో అమెరికాలో స్థిరపడింది.