ఇండస్ట్రీ లో రోజుకి చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు.కానీ అందులో కొందరు మాత్రమే హీరోలుగా సక్సెస్ అవుతున్నారు.
మరికొందరైతే ఎంత తొందరగా ఇండస్ట్రీ కి వస్తున్నారో అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మొదట విలన్ గా ఇండస్ట్రీకి వచ్చిన గోపీచంద్( Gopichand ) ఆ తర్వాత యజ్ఞం సినిమా( Yagnam movie )తో స్టార్ హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు తప్ప స్టార్ హీరోగా మాత్రం మారలేకపోతున్నాడు.

ఆయనతో పాటు వచ్చిన చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతూ వాళ్ళకంటు ఇండస్ట్రీలో ఒక భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు.కానీ గోపీచంద్ మాత్రం తన కంటూ ఉన్న మార్కెట్ ను కూడా ఇంప్రూవ్ చేసుకోవడంలో చాలా వెనుకబడి పోయాడనే చెప్పాలి.అయితే గోపీచంద్ ఇలా స్టార్ హీరో అవ్వకపోవడనికి కారణాలు ఏంటి అంటే ఆయన చేస్తున్న సినిమాల్లో కంటెంట్ ఏమీ పెద్దగా లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

అలాగే దానికి తోడుగా కొత్త దర్శకులు లేదా ఒకటి రెండు సినిమాలు చేసిన దర్శకులతో సినిమాలు చేయడం వల్ల ఆయనకు మార్కెట్ కూడా భారీగా డౌన్ అయిపోతుంది.ఇంక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా ప్లాప్ లు అవుతుంటే ఆయన మార్కెట్ కూడా రోజురోజుకి డౌన్ అవుతూ వస్తుంది.ఇక దీనివల్ల గోపిచంద్( Gopichand ) స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడు.ఇక మొత్తానికైతే గోపీచంద్ స్టార్ హీరో అవ్వాలంటే ఇప్పుడు వచ్చే రెండు మూడు సినిమాలతో భారీ సక్సెస్ సాధించాలి.
లేకపోతే మాత్రం గోపీచంద్ కెరియర్ డైలమా లో పడిపోతుందనే చెప్పాలి…చూడాలి మరి గోపి చంద్ ఈ సినిమా సక్సెస్ సాధిస్తాడో లేదో…
.