ఎంతో మంది భారతీయులు విదేశాలలో సెటిల్ అయ్యి అక్కడ ఉన్నత స్థితిని చేరుకుని వివిధ ప్రాంతాలలో స్థిరపడిపోతూ ఉంటారు.అంతేకాదు చాలా మంది విదేశీ యువతీ యువకులని పెళ్ళిళ్ళు చేసుకుంటారు కూడా అయితే ఎన్నారైల కోసం భారత ప్రభుత్వం కల్పించే ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుని పొందే అర్హత మాత్రం ఉండదు ఈ వెసులు బాటు కేవలం భారత పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే చెందుతుంది.
అయితే ఇకనుంచీ భారత జాతీయత కలిగిన వ్యక్తి లేదా విదేశాల్లోని భారత పౌరసత్వం ఉన్న వ్యక్తికి చెందిన విదేశీ భాగస్వామికి కూడా ఈ ఓసీఐ కార్డు లభిస్తుంది.ఇప్పటిదాకా ఇలాంటి విదేశీ సంతతి జీవితభాగస్వాములకు ఓసీఐ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు.ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డుదారుకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
అందుకే కేంద్రం దీనికి సంబంధించి నిబంధనల్లో మార్పులు తెస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.అదేవిధంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకుని, విదేశీ పౌరసత్వం పొందేందుకు కూడా నిబంధనలను సరళతరం చేసింది.అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.