కుక్క కనిపెట్టిన అరుదైన 'పాము'

కుక్కలకు పాము కనబడితే అది పారిపోయేంతవరకు వదలవు.పాముని ముందుకు కదలకుండా అడ్డుపడుతూ ఉంటాయి.

 Rare Snake Invented By Dog At Karnataka-TeluguStop.com

ఈ విధంగానే కర్ణాటకలోని హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు మధ్య పెద్ద గొడవే జరిగింది.అవినాశ్‌ అనే వ్యక్తికి చెందిన తోటలో సుమారు అరగంట పాటు సాగిన కీచులాటలో నాగుపాము రోషంతో పడగవిప్పి బుసకొడుతూ కుక్కను ఎదుర్కొంది.

కుక్క అరుపులు విని బయటకి వచ్చి చుసిన అవినాశ్ కుటుంబ సభ్యులకు అరుదైన దృశ్యం కంటపడింది.బంగారు వర్ణంలో మెరిసిపోతూ పడగ విప్పిన పాము భానుడి కిరణాల వెలుగులో మరింత ప్రకాశించడం ఆశ్యర్యానికి గురిచేసింది.ఆ అరుదైన పాముకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు.ఈ విషయం కాస్త స్థానికులకు తెలియడంతో అది అలాంటి ఇలాంటి సర్పం కాదని అద్భుత శక్తులున్న పాము అని స్థానికులు ప్రచారం మొదలుపెట్టడంతో ఆ పాముని చూసేందుకు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube