ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే

ప్రతి నెల ఒకటో తేదీ వస్తుందంటే చాలా మార్పులు వస్తుంటాయి.ఉద్యోగులకు శాలరీలు పడతాయి.

అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి.కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తూ ఉంటాయి.

ప్రభుత్వం అమలు చేసే అనేక స్కీమ్ లు, బ్యాంకులు అమలు చేసే కొత్త నిర్ణయాలు నెల ఒకటవ తేదీ నుంచి అమల్లోకి తెస్తుంటాయి.ఇప్పుడు ఆగస్టు 1 నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి.

అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.బ్యాంక్ అఫ్ బరోడా ఒక కొత్త నిర్ణయాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న చెక్కులపై పాజిటివ్ పే సిస్టమ్ ని బ్యాంక్ ఆఫ్ బరోడా నేటి నుంచి అమల్లోకి తీసుకురానుంది.ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయాన్ని అమల్లోకి ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకురానుంది.

Advertisement

చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకున్న ఖాతాదారుడి వివరాలు, సంబంధిత వ్యక్తికి చెక్కు ఇచ్చిన సంస్థ లేదా వ్యక్తుల వివరాలను ధృవీకరించాలి.ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అమల్లోకి రానుంది.

కేవైసీ అప్ డేట్ చేసుకునేందుకకు మే 31 నుంచి జులై 31వరకు గడువు పొడించింది.

రేపటి నుంచి కేవైసీ అప్ డేట్ ను చేసుకునే అవకాశం కల్పించనుంది.ఇక పీఎంఎఫ్ బీవై రిజిస్ట్రేషన్లు జులై31తో ముగియనున్నాయి.దీంతో రేపటి నుంచి దీనికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు.

ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ లైన్ లోనైనా చేసుునే సదుపాయం కూడా ఉంది.ఇక ప్రతి నెల ఒకటవ తేదీన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ధరలు సవరిస్తారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఏప్రిల్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి.ఇక డొమెస్టిక్ సిలిండర్ల ధరలు గత నెలలో పెరిగాయి.

Advertisement

నేటి నుంచి ధరలను సవరించనున్నారు.ఇక ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ సమర్పించడానికి జులై 31 చివరితేదీ.

దీంతో ఆగస్టు 1 నుంచి అవకాశం లేదు.ప్రభుత్వం పొడిగిస్తే తప్పితే ఐటీఆర్ రిటర్న్ కు నేటి నుంచి అవకాశం లేదు.

ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేస్తే ఆగస్టు 1 నుంచి జరిమానా, ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.ఇలా ఆగస్టు 1 నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి.

తాజా వార్తలు