తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) ఒకరు.జయపజయాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలు అన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇలా సినిమాలు మాత్రమే కాకుండా ఆహా(Aha) ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా( Family Dhamaka ) అనే షోని కూడా మొదలుపెట్టాడు.ఈ షో ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే త్వరలోనే విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇకపోతే విశ్వక్ తన సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్లలో భాగంగా కొన్నిసార్లు చేసే ప్రాంక్ వీడియోలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయని చెప్పాలి.ఇలా ఇదివరకు ఇలాంటి ప్రాంక్ వీడియోలు ద్వారా ఈయన వివాదాలలో చిక్కుకున్నారు.ఇలా నిత్యం వివాదాలలో ఉండే ఈయన ఒక్కసారిగా భక్తి భావంలో మునికి తేలుతూ కనిపించారు.
దీంతో ఈయనలో ఇలాంటి కోణం కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.తాతగా ఒక వేడుకలో పాల్గొన్నటువంటి ఈయన ఆంజనేయ స్వామి మాల (Anjaneya Swami Mala)ధరించి కనిపించారు.
ఈ విధంగా విశ్వక్ సేన్ ఆంజనేయ స్వామి మాల ధరించి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా ఈయన మాల ధరించి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ జై భజరంగ బలి అంటూ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.ఇలా ఈయనని ఉన్నఫలంగా ఆంజనేయ స్వామి మాలలో చూడటంతో అభిమానులందరూ కూడా విశ్వక్ ఏంటి ఉన్నఫలంగా ఇలా భక్తి భావంలో మునిగి తేలుతున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.