సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాఘవ లారెన్స్ త్వరలోనే చంద్రముఖి 2 ( Chandramukhi 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.రజనీకాంత్ హీరోగా వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో రజనీకాంత్ స్థానంలో లారెన్స్( Lawrence )నటించిన సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలో లారెన్స్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ తెలుగులో రెబల్ సినిమా( Rebel Movie ) తర్వాత నాకు మరొక సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం రాలేదని తెలిపారు.ఇక చాలా రోజుల తర్వాత చంద్రముఖి2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఈయన తెలియజేశారు.ఇక మీ అందరి ఆశీర్వాదం ప్రేమ కారణంగానే తాను ఈ వేదికపై నిలబడ్డానని అభిమానులను ఉద్దేశిస్తూ ఈయన మాట్లాడారు.
ఇక హీరోగా నేను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం ముగ్గురు వ్యక్తులని, ఆ ముగ్గురిని తాను ఎప్పుడూ మర్చిపోలేనని తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) గారి కారణంగానే తాను ఇక్కడ ఈ వేదికపై నిలబడ్డానని తెలిపారు.అలాగే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) అన్నయ్య నుంచి తాను డాన్స్ నేర్చుకున్నారని అలాగే నాగార్జున ( Nagarjuna ) గారి వల్ల డైరెక్టర్ అయ్యానని ఈయన తెలియజేశారు.ఇలా ఈ ముగ్గురు హీరోలను నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ లారెన్స్ ఈ సందర్భంగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఇక అభిమానులను ఉద్దేశిస్తూ కూడా ఈయన పలు విషయాలు మాట్లాడారు.మీ అందరి ప్రేమ కరుణ కటాక్షాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని మేము చేసిన సినిమాల నుంచి ఏం ఆశించకుండా మమ్మల్ని అభిమానిస్తున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అంటూ ఈ సందర్భంగా లారెన్స్ వెల్లడించారు.