వైరల్ వీడియో: ఆ పని చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన అంధులు..!

ప్రస్తుతం ప్రపంచంలో ఎంతో మందికి అన్ని అవయవాలు సరిగా ఉన్న కానీ కష్టపడి సంపాదించడానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు.వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసి, మరికొందరు డబ్బులు సంపాదించడానికి వక్ర మార్గాలను ఎంచుకొని ఇలా ఎన్నో రకాలుగా డబ్బులు కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

 Viral Video, Blind, Created, World Record , 50 Chairs, Unico World Reords, Visu-TeluguStop.com

కొంతమంది వికలాంగులను చూస్తే అన్ని అవయవాలు సరిగా ఉన్న మనిషి కూడా చేయలేని పనులను వారు అతి సులువుగా చేసేస్తుంటారు.కొన్నిసార్లు వికలాంగులు చేసే పని చూస్తే మనం కళ్ళు మూసుకోకుండా వారు చేసే పనినే ఆస్వాదిస్తూనే ఉంటాం.

ఇందులో ముఖ్యంగా కళ్లు కనిపించని వారు చేసే పనులు చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం.

నిజానికి కళ్లు కనిపించని గుడ్డివారు ఈ లోకాన్ని చూడలేకపోవచ్చు.

కాకపోతే, ఆ అంధుల ప్రతిభను మాత్రం ప్రపంచం ఇట్లే గుర్తిస్తుంది.అంతేకాదు వారికి ప్రోత్సాహం కూడా కల్పిస్తారు ఎందరో.

ఇందులో భాగంగా తాజాగా భారత దేశంలోని చెన్నై నగరంలో గురువారం నాడు యూనికో చారిటబుల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్లైండ్ వెల్ఫేర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొందరు అంధులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు అంధులు కేవలం ఆరు గంటల్లో 50 వైరు కుర్చీలను చేతితో అల్లేసి తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు.ఈ దెబ్బతో వారు మనిషికి ఏమి తీసిపోమని నిరూపించారు.వారందరూ కలిసి చేసిన పనికి యునికో వరల్డ్ రికార్డ్స్ లో వారికి ఓ స్థానం సంపాదించుకున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అబ్బురపరిచే వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.మీ దగ్గరలో ఇలా టాలెంట్ కలిగిన వికలాంగులు ఉంటే వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు సహాయం చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube