ప్రస్తుత కాలంలో చాలా మందిలో, ముఖ్యంగా యువకులలో వయసుతో పనిలేకుండా హెయిర్ ఫాలింగ్ అనేది చాలా దారుణంగా జరిగి ఆఖరికి నిండా 25 ఏళ్ళు గడవకుండానే బోల్డ్ హెడ్ అయిపోతోంది.దాంతో చాలామంది యువకులు మానసికంగా కృంగిపోతున్నారు.
ఆ మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి ఆఖరికి ఆత్మహత్యలదాకా వెళ్లిపోతున్నాయి.అయితే కొంతమంది మాత్రం మనసుని ధృడ పరుచుకొని ముందుకి పోతున్నారు.
ఏదిఏమైనా అందం చాలా కీలక పాత్రపోషిస్తున్న తరుణంలో ఇలా కురాళ్ళ తమ కురులను కోల్పోవడం అనేది చాలా బాధాకరమే.
అయితే తాజాగా తన తలపైన పూర్తిగా హెయిర్ కోల్పోయిన యువకుడు ఓ బార్బర్ షాపుకి వెళ్లి, అక్కడ ప్రవర్తించే తీరు చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
మీరు హెయిర్‌కట్స్, హెయిర్ స్టైల్స్‌కు సంబంధించిన అనేకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చూసే ఉంటారు కదా.అయితే ఇది నెక్స్ట్ లెవల్ వీడియో అని చెప్పుకోవాలి.ఎందుకంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో బాల్డ్ హెడ్ కలిగిన ఒక వ్యక్తి బార్బర్ వద్దకు వెళ్లి హెయిర్ కట్ చేయమని కూర్చుంటాడు.ఇక కస్టమర్‌కు సాదర మర్యాదలు చేసి హెయిర్ కట్ చేద్దామని అతని తలపై ఉన్నపాగాను తీసి చూడగా నున్నని గుండు కనిపిస్తుంది.
ఇంకేముంది, తనతోనే జోకులా అని బార్బర్.ఆ కస్టమర్ తల మీద ఒక్కటి ఇచ్చి, అక్కడినుండి వెంటనే వారిని వెళ్లిపొమ్మని చెబుతాడు.అంతేకాకుండా అక్కడే ఉండి ఆ తతంగాన్ని వీడియో షూట్ చేస్తున్న వ్యక్తిని కూడా అతగాడు దెబ్బలాడి బయటకు పంపివేస్తాడు.royal_writes06 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోని చూసి నెటిజన్లు ఫుల్ ఖుషి చేసుకుంటున్నారు.ఇక ఈ వీడియోకు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ చాలా ఫన్నీగా ‘తన కస్టమర్‌కు కావలసిన హెయిర్‌కట్ చేయడంలో ఆ బార్బర్ పూర్తిగా విఫలమయ్యాడు’అని కామెంట్ చేశాడు.