మండుటేసవి అప్పుడే జనాలకు మంట పుట్టిస్తోంది.ముఖ్యంగా కాస్త వేడిగా వున్న ప్రాంతాలలో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి.
ఇక మీరు కూడా అలాంటి వాతావరణంలో నివసిస్తున్నవారు అయితే, మీకో చిన్న ఫ్యాన్ అవసరం ఎంతైనా ఉంటుంది.మరీ ముఖ్యంగా పల్లె వాతావరణంలో నివసిస్తున్నవారికి ఈ మూడు నాలుగు నెలలు సరిగ్గా కరెంట్ కూడా ఉండదు.కాబట్టి మీకు ఈ చిట్టి పొట్టి ఫ్యాన్ అవసరం ఎంతైనా ఉంటుంది మరి.అవును… మీరు ఎక్కడికి వెళ్లినా ఆ ఫ్యాన్ మీకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ముఖ్యంగా ఈ వేసవిలో పిల్లలు, పెద్దలూ ఉక్కపోతతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఉక్క వల్ల సరిగా గాలి అందే అవకాశం ఉండదు.అలాంటి వారికి కొద్ది పాటి ఉపశమనం కలిగించే సింపుల్ మినీ ఫ్యాన్ గురించి ఇపుడు తెలుసుకుందాం.దీన్ని కిడ్స్ హ్యాండ్ ప్రెషర్ మినీ ఫ్యాన్ అని కూడా అంటున్నారు.
ఈ ఫ్యాన్ తిరిగేందుకు కరెంటుగానీ, బ్యాటరీ గానీ అవసరం లేదు.ఈ ఫ్యాన్ రెక్కల కింద ఉండే స్టిక్‌ని అటూ ఇటూ కదుపుతూ ఉంటే.బోలెడు గాలి వస్తుంది మరి.మనకు ఎంత గాలి కావాలనిపిస్తే.అంత పొందవచ్చు.
Generic బ్రాండ్ నేమ్‌తో ఈ ఫ్యాన్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.ఇవి పిల్లలతోపాటూ పెద్దలకు కూడా ఉపయోగ పడతాయి.ఇవి రకరకాల రంగుల్లో లభిస్తాయి.
ఇవి చూడడానికి టాయ్స్ లాగా కనబడడం వలన పిల్లలు వీటిని ఆడుతూ.గాలి కూడా పొందుతారు.
మీరు ఎవరికైనా గిఫ్టుగా ఇవ్వాలంటే.ఈ ఫ్యాన్లను ఇవ్వొచ్చు.ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో 2 ఫ్యాన్‌ల ప్యాక్ ధరను రూ.295గా చెబుతున్నారు.రెండు ప్యాకెట్లు కొనుక్కునేవారికి ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు.ఈ ఫ్యాన్ తేలిగ్గా ఉంటుంది.56 గ్రాముల బరువు ఉంటాయి.దీని రెక్కలు పాస్టిక్‌తో చేసినవి.
పిల్లలకు ఎలాంటి హానీ కలిగించవు అని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.