ఖుషి మూవీ ట్రైలర్ రివ్యూ.. పవన్ ఖుషి మ్యాజిక్ ను విజయ్, సామ్ రిపీట్ చేసినట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషి( kushi movie ) ఒకటి కాగా ఈతరం ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారు.అయితే అదే టైటిల్ తో విజయ్, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.

 Vijay Samantha Kushi Movie Trailer Review Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

Telugu Kushi, Pawan Kalyan, Samantha, Shiva Nirvana, Tollywood, Vijay-Movie

సమంత ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.ముస్లిం యువతిగా, బ్రాహ్మణ యువతిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించగా ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.విజయ్, సామ్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది.

ట్రైలర్ లో సమంత లుక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.అసలు భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమజానికి చూపిస్తా అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.

Telugu Kushi, Pawan Kalyan, Samantha, Shiva Nirvana, Tollywood, Vijay-Movie

విప్లవ్, ఆరాధ్య పాత్రలకు విజయ్, సమంత( Samantha ) పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.ఖుషి సినిమా ట్రైలర్ లో హిట్టు కళ కనిపిస్తుంది.మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.ఖుషి ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.కేవలం 45 నిమిషాల్లో ఈ ట్రైలర్ కు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.పవన్ ఖుషి మ్యాజిక్ ను విజయ్, సామ్ రిపీట్( Vijay Deverakonda ) చేసేలా ఉన్నారు.

ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ యాప్ట్ టైటిల్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.

ఇన్నాళ్లు ఎదురుచూసిన ఎదురుచూపులకు ఈ సినిమాతో ఫలితం దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube