ఖుషి మూవీ ట్రైలర్ రివ్యూ.. పవన్ ఖుషి మ్యాజిక్ ను విజయ్, సామ్ రిపీట్ చేసినట్టేనా?
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషి( Kushi Movie ) ఒకటి కాగా ఈతరం ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడతారు.
అయితే అదే టైటిల్ తో విజయ్, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.
"""/" /
సమంత ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
ముస్లిం యువతిగా, బ్రాహ్మణ యువతిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించగా ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
విజయ్, సామ్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది.ట్రైలర్ లో సమంత లుక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.
అసలు భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమజానికి చూపిస్తా అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.
"""/" /
విప్లవ్, ఆరాధ్య పాత్రలకు విజయ్, సమంత( Samantha ) పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
ఖుషి సినిమా ట్రైలర్ లో హిట్టు కళ కనిపిస్తుంది.మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఖుషి ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.కేవలం 45 నిమిషాల్లో ఈ ట్రైలర్ కు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
పవన్ ఖుషి మ్యాజిక్ ను విజయ్, సామ్ రిపీట్( Vijay Deverakonda ) చేసేలా ఉన్నారు.
ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ యాప్ట్ టైటిల్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.
ఇన్నాళ్లు ఎదురుచూసిన ఎదురుచూపులకు ఈ సినిమాతో ఫలితం దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ & రేటింగ్