కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ( Vijay Dalapathi ) అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.ఈయన సౌత్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు.
అలాంటి విజయ్ ఏ సినిమా చేసిన కూడా సూపర్ హిట్టే అన్నట్లుగా ఉంటుంది.ఇక ఈ మధ్యకాలంలోనే లియో ( Leo ) సినిమాతోమన ముందుకి వచ్చారు.
అయితే గత కొద్ది రోజులుగా విజయ్ దళపతి తన భార్య సంగీత తో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.అంతేకాదు విజయ్ నటించిన ఓ సినిమా ఫంక్షన్ కి విజయ్ భార్య సంగీత రాకపోవడంతో ఈ రూమర్ మరింత వైరల్ అయింది.
వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని, ఈ కారణంతోనే సంగీత విజయ్ సినిమా ఫంక్షన్ కి రాలేదని ఇలా రకరకాల ప్రచారాలు తెరపైన వినిపించాయి.అయితే ఈ విషయం గురించి స్వయంగా విజయ్ తో నటించిన ఒక నటి రీసెంట్గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.ఇక విజయ్ ఈ మధ్యకాలంలో నటించిన లియో సినిమాలో జననీ ( Janani ) అనే నటి చేసిన సంగతి మనకు తెలిసిందే.జనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
నాకు ఒక్కసారైనా విజయ్ తో కలిసి నటించే అవకాశం వస్తే చాలు అనుకున్నాను.కానీ ఆ సినిమా షూటింగ్లో చాలాసార్లు విజయ్ నాతో మాట్లాడి టైం స్పెండ్ చేశారు.
ఇక నేను ఆయనతో మాట్లాడే సమయంలో శ్రీలంకన్ తమిళ్ మాట్లాడేదాన్ని.ఇక అలా మాట్లాడేటప్పుడు విజయ్ ప్రతిసారి నువ్వు అలా మాట్లాడుతుంటే నా భార్య సంగీత ( Sangeetha ) నే నాకు గుర్తుకు వస్తుందని అనేవాడు.ఎందుకంటే విజయ్ భార్య సంగీత కూడా శ్రీలంకలోని ఆప్నాలో పుట్టింది.ఇక ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు నాతో ఎంతో బాగా మాట్లాడారు.ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని,ఎందుకంటే నేను ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే చాలు అనుకున్నాను కానీ ఆయన నాతో చాలా బాగా మాట్లాడారు.అలాగే నన్ను ఒక చెల్లెలు లాగా భావించారు.
ఇక విజయ్ సంగీత ( Vijay-Sangeetha ) ఇద్దరు దూరంగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అది కేవలం రూమర్ మాత్రమే అంటూ లియో మూవీలో చేసిన నటి జనని స్పష్టం చేసింది.ఇక జనని క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికైనా విజయ్ సంగీత విడాకుల వార్తలు ఆగిపోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.