రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి’ ( Khushi ).విజయ్, సమంత ఇద్దరు కూడా ప్లాప్స్ తో బాధ పడుతున్నారు.
విజయ్ లైగర్ సినిమాతో, సమంత శాకుంతలం సినిమాతో భారీ ప్లాప్ లను అందుకున్న విషయం తెలిసిందే.
మరి ఈ ప్లాప్ ను ఫ్యాన్స్ మర్చిపోవాలంటే ఇంతకంటే హిట్ సినిమా రావాలి.అందుకే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు కలిసి నటిస్తున్న ఖుషి సినిమా మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.శివ నిర్వాణ ( Shiva Nirvana ) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో ( Khushi First Single ) రిలీజ్ చేసారు.ఈ ప్రోమో చూడ్డానికి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది.పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ ప్రోమోను రిలీజ్ చేయగా మంచి స్పందన లభిస్తుంది.
ఫుల్ సాంగ్ మే 9న రాబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందో చూడాలి.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్నట్టు ఈ మధ్యనే ప్రకటించారు.కాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్నారు.