వేణు స్వామి తరచూ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఈయన పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు.
తాజాగా లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati )వరుణ్ తేజ్ ( Varun Tej ) విడాకుల గురించి మరోసారి వేణు స్వామి ( Venu Swamy ) సంచలన వ్యాఖ్యలు చేశారు వీరిద్దరూ కలిసి ఉండటం పెద్ద మిరాకిల్ అని తెలిపారు.వీరిద్దరూ తప్పకుండా విడిపోతారని కాస్త ఆలస్యంగా అయినా ఇది జరుగుతుందని వేణు స్వామి తెలిపారు.
నేను ఇలాంటి జాతకాలు చెప్తే చాలా మంది నాపై పడి ఏడుస్తారు కానీ నేను వారి జాతకాలను ఉద్దేశించే చెబుతున్నానని ఈయన తెలిపారు.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాలని చూస్తే వీరిద్దరికీ అసలు వివాహ యోగ్యమే లేదని తెలిపారు.వరుణ్ తేజ్ జాతకంలో నాగదోషం ఉంది అలాగే లావణ్య జాతకంలో గురుదోషం( Guru Dosham ) ఉంది ఇది మాత్రమే కాకుండా లావణ్యను నాగ దోషం, కుజ దోషం రెండు వెంటాడుతున్నాయి.వీరిద్దరి జాతకంలో గురుడు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు.
ఇలాంటి దోషాలు ఉన్నవారు అసలు కలిసి ఉండలేరు కానీ వీరిద్దరూ కలిసి ఉన్నారంటే అది మిరాకిల్ అని తెలిపారు.కాకపోతే వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరని విడాకులు( Divorce )తీసుకుని విడిపోతారని వేణు స్వామి తెలిపారు.అయితే వీరిద్దరూ కూడా వీరి కుటుంబంలోని ఒక ప్రధాన మహిళ కారణంగానే విడిపోతారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి వరుణ్ లావణ్య జాతకం గురించి వారు విడాకులు తీసుకుంటారంటూ చేసినటువంటి ఈ కామెంట్ లు సంచలనంగా మారాయి.ఇక ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు( Mega Fans ) వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు.