ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ ప్రపంచంలో ఎంతోమంది ఎక్కువగా వాడే లిస్టులో మొదటి స్థానాలలో ఉంటుంది.ఈ నేపథ్యంలో రోజురోజుకు వస్తున్న మార్పులను అనుసరించి వాట్సప్( Whatsapp ) వారి యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది.
ఈ మధ్యకాలంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సదుపాయాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నించింది.ఈ నేపథ్యంలోనే మరోసారి వాట్సాప్ కొత్త ఫీచర్లు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
తాజాగా తీసుకురాబోతున్న అప్డేట్ లో మనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లేదా ఏదైనా ఫైల్స్ సంబంధించిన వాటిని ఇంటర్నెట్ లేకుండా షేర్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది వాట్సాప్.అంటే ఒకవేళ మన మొబైల్ లో ఇంటర్నెట్( Internet ) లేకపోయినా సరే వాటిని షేర్ చేసే సదుపాన్ని కల్పించబోతోంది వాట్సాప్.ఇందుకోసం కొత్తగా ఎటువంటి కొత్త యాప్ ను వినియోగించాల్సిన అవసరం లేదు.
డాక్యుమెంట్స్( Documents ) మరింత వేగంగా అలాగే సురక్షితంగా పంపించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
ఇక ఇందుకు సంబంధించి కొత్త ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోవాలంటే వాట్సాప్ సిస్టం ఫైల్, ఫోటోల గ్యాలరీ యాక్సిస్ లాంటి అనుమతులను ఇవ్వాల్సి ఉంటుంది.ఒకవేళ మీరు పంపించవలసిన వ్యక్తి మొబైల్ కనుక బ్లూటూత్ కనెక్ట్ అయ్యే రేంజ్ లో ఉండే ఆఫ్ లైన్ షేరింగ్( Off Line Sharing ) వీలుకాబోతోంది.బ్లూటూత్ ఆన్ చేసి దగ్గరలోని వాట్సాప్ యూజర్ పరికరాన్ని గుర్తించి ఆ ఫైల్ సెండ్ చేయవచ్చు.
అచ్చం బ్లూటూత్( Bluetooth ) ఆప్షన్ ఎలా పనిచేస్తుందో అలాగే వాట్సప్ ఆఫ్లైన్ ఆప్షన్ కూడా అలాగే పని చేస్తుంది.ఏదైనా సరే అవతలి వ్యక్తి కూడా మీ ఫోటోలను రిసీవ్ చేయాలనుకునే యూజర్ అనుమతిస్తేనే మీ ట్రాన్స్ఫర్ సక్సెస్ అవుతుంది.
ఇకపోతే ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వర్షన్ యూజర్లకు మాత్రమే టెస్టింగ్ దశలో ఉంది.ముందు ముందు ప్రతి యూజర్ కి ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.