అమెరికాలో అటార్నీ జనరల్ కి అసమ్మతి సెగ తలుగుతోంది.తాత్కాలిక అటార్నీ జనరల్ గా ఎంపిక అయిన విటేకర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ సవాల్ చేసారు 15 మంది అటార్నీస్.
ఇందుకు గాను వారు సోమవారం అమికస్ బ్రీఫ్ కూడా దాఖలు చేశారు.ఆయన నియామకాన్ని అడ్డుకునేందుకు మేరీల్యాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఈ ఫ్రోష్ తెచ్చిన మోషన్ ను వారు కూడా సమర్థించారు…ఇది చెయిన్ ఆఫ్ సక్సెషన్ ను ఉల్లంఘించడమేనని అంటున్నారు.
అయితే సెషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా తప్ప డిప్యూటీ అటార్నీ జనరల్ గా పనిచేయని మాథ్యూ విటేకర్ ను అసలు తాత్కాలిక అటార్నీ జనరల్ గా ఎలా నియమిస్తారని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు…అంతేకాదు ఆయన నియామకాన్ని ఆపాలని కోరుతూ నవంబర్ 13న ఫ్రోష్ కోర్టుని ఆశ్రయించారు.ఈ కేసులో తాత్కాలిక అటార్నీ జనరల్ నిర్ణయం లక్షలాది ప్రజల ఆరోగ్యం, జీవన్మరణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు.