యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్ష( Civils ) సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కోచింగ్ లేకుండా ఈ పరీక్ష పాస్ కావాలంటే సులువు కాదు.
అయితే రాజమండ్రికి ( Rajahmundry ) చెందిన యువకుడు మాత్రం వరుసగా రెండుసార్లు సివిల్స్ సాధించి సత్తా చాటడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నాడు.తన సక్సెస్ స్టోరీతో ఈ యువకుడు నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు.
రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్( Tharun Patnaik ) పట్టుదల, ప్రణాళిక ఉంటే లక్ష్యం సాధించడం సులువేనని ప్రూవ్ చేస్తున్నాడు.తరుణ్ పట్నాయక్ తండ్రి రవికుమార్ పట్నాయక్ రాజమహేంద్రవరం రూరల్ బ్రాంచ్ లో క్లర్క్ గా పని చేస్తుండగా తల్లి రాజ్యలక్ష్మి గృహిణిగా పని చేస్తున్నారు.బాల్యం నుంచి తరుణ్ లక్ష్యంపై దృష్టి పెట్టారు.2020లో ఐఐటీ గౌహతిలో( IIT Guwahati ) తరుణ్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి తరుణ్ తన లక్ష్యాన్ని సాధించడం గమనార్హం.2021లో తొలి ప్రయత్నంలో 99వ ర్యాంక్ సాధించిన తరుణ్ రెండో ప్రయత్నంలో 33వ ర్యాంక్ సాధించారు.సామాన్య కుటుంబంలో జన్మించిన తరుణ్ ఎంతో కష్టపడటం వల్లే ఐఏఎస్( IAS ) స్థాయికి చేరుకున్నారు.చిన్న వయస్సులోనే తరుణ్ లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
తరుణ్ పట్నాయక్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.తరుణ్ పట్నాయక్ తన కలను సాకారం చేసుకోవడంతో పాటు తన తల్లీదండ్రుల వల్లే సక్సెస్ అయ్యానని చెబుతున్నారు.తరుణ్ పట్నాయక్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇష్టపడి చదివితే ఎవరైనా తమ లక్ష్యాలను సులువుగా సాధించడం సాధ్యమవుతుందని తరుణ్ చెబుతున్నారు.రెండో విడతలో కొడుకు ఐఏఎస్ కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తరుణ్ పట్నాయక్ తల్లీ దండ్రులు వెల్లడిస్తున్నారు.