ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ప్రభావం వల్ల చాలా సినిమాలు థియేటర్లలో విడుదలకు నోచుకోలేక పోతున్నాయి.ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీలలో విడుదలవుతున్నాయి.

 Upcoming Movies In September First Week , Nootokka Jillala Andagadu, Dear Megha,-TeluguStop.com

అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి రావడం చేత థియేటర్లు తెరుచుకున్నాయి.ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఇప్పటికే కరోనా రెండవ దశ తర్వాత పలు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.మరి ఈ వారం థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే.

101 జిల్లాల అందగాడు:.దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా,రుహానీ శర్మ హీరోయిన్లుగా రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం “101 జిల్లాల అందగాడు”.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డియర్‌ మేఘ కథ: మేఘా ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో,అర్జున్‌ దాస్యన్‌ నిర్మాణంలో సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “డియర్‌ మేఘ కథ”.ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Appudu Ippudu, Dear Megha, Nootokkajillala, Killer-Movie

అప్పుడు ఇప్పుడు: చలపతి పువ్వుల దర్శకత్వంలో సుజన్‌, తనీష్క్‌ జంటగా నటించినటువంటి చిత్రం “అప్పుడు ఇప్పుడు”.ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కానుంది.

ది కిల్లర్ : క్రైమ్ థ్రిల్లర్ గా చిన్నా దర్శకత్వంలో కార్తీక్‌ సాయి, డాలీ షా, నేహా దేశ్‌పాండే కీలక పాత్రలో నటిస్తున్నటువంటి చిత్రం “ది కిల్లర్” ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది.

Telugu Appudu Ippudu, Dear Megha, Nootokkajillala, Killer-Movie

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9: ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ ప్రియులు ఎంతో ఇష్టపడే సిరీస్లలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ఒకటి.ఇప్పటికే 8 సిరీస్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే తొమ్మిదవ సిరీస్ సెప్టెంబర్ 3వ తేదీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే సినిమాలు: స్పార్కింగ్‌ జాయ్‌ (ఆగస్టు 31), గుడ్‌ గర్ల్స్‌ (ఆగస్టు 31),మనీ హెయిస్ట్‌-సీజన్‌5 (సెప్టెంబరు 3)న విడుదల కానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్: బ్లాక్‌ విడో సెప్టెంబరు 3 వ తేదీ విడుదల కానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో: సిండ్రెల్లా సెప్టెంబర్ 3 న స్ట్రీమింగ్ కానుంది.

జీ 5: హెల్మెట్‌ సెప్టెంబరు 3 న విడుదల కానుంది.

హెచ్‌బీవో మ్యాక్స్‌: రెమినిసెన్స్‌ సెప్టెంబరు 3 వ తేదీ విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube