ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ప్రభావం వల్ల చాలా సినిమాలు థియేటర్లలో విడుదలకు నోచుకోలేక పోతున్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీలలో విడుదలవుతున్నాయి.అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి రావడం చేత థియేటర్లు తెరుచుకున్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇప్పటికే కరోనా రెండవ దశ తర్వాత పలు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

మరి ఈ వారం థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే.

101 జిల్లాల అందగాడు:.దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా,రుహానీ శర్మ హీరోయిన్లుగా రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం "101 జిల్లాల అందగాడు".

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డియర్‌ మేఘ కథ: మేఘా ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో,అర్జున్‌ దాస్యన్‌ నిర్మాణంలో సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "డియర్‌ మేఘ కథ".

ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. """/"/ అప్పుడు ఇప్పుడు: చలపతి పువ్వుల దర్శకత్వంలో సుజన్‌, తనీష్క్‌ జంటగా నటించినటువంటి చిత్రం "అప్పుడు ఇప్పుడు".

ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కానుంది.ది కిల్లర్ : క్రైమ్ థ్రిల్లర్ గా చిన్నా దర్శకత్వంలో కార్తీక్‌ సాయి, డాలీ షా, నేహా దేశ్‌పాండే కీలక పాత్రలో నటిస్తున్నటువంటి చిత్రం "ది కిల్లర్" ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది.

"""/"/ ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9: ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ ప్రియులు ఎంతో ఇష్టపడే సిరీస్లలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ఒకటి.

ఇప్పటికే 8 సిరీస్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే తొమ్మిదవ సిరీస్ సెప్టెంబర్ 3వ తేదీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే సినిమాలు: స్పార్కింగ్‌ జాయ్‌ (ఆగస్టు 31), గుడ్‌ గర్ల్స్‌ (ఆగస్టు 31),మనీ హెయిస్ట్‌-సీజన్‌5 (సెప్టెంబరు 3)న విడుదల కానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్: బ్లాక్‌ విడో సెప్టెంబరు 3 వ తేదీ విడుదల కానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో: సిండ్రెల్లా సెప్టెంబర్ 3 న స్ట్రీమింగ్ కానుంది.జీ 5: హెల్మెట్‌ సెప్టెంబరు 3 న విడుదల కానుంది.

హెచ్‌బీవో మ్యాక్స్‌: రెమినిసెన్స్‌ సెప్టెంబరు 3 వ తేదీ విడుదల కానుంది.

ఇంకెన్ని రోజులు అఖిల్.. అక్కినేని అభిమానుల ఆవేదన నీకు అర్థమవుతోందా?