కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనం ఊహించకుండా జరిగిపోతూ ఉంటాయి.యాదృచ్ఛికంగా జరిగిన లేదా కావాలని జరిగిన ఎలా అయినా కూడా అవి చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి.
అలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో అనేకం ఉంటాయి ఎలా అంటే తెలుగులో తెలుగులో గుమ్మడి, ఎస్వీ రంగారావు లాంటి పెద్ద తరహ పాత్రలకు పేరెన్నిక గల నటుల పేర్లు చెప్పమంటే ఆ తర్వాత కాలంలో మరొక ముగ్గురు నటుల పేర్లు ప్రముఖంగా చెప్పాల్సి ఉంటుంది.అందులో ఒకరు కైకాల సత్యనారాయణ, మరొకరు తిలకన్, మరియు బాలీవుడ్ నటుడు ప్రాణ్.
ఈ ముగ్గురు నటులు కూడా తమ కెరియర్లో పెద్ద తరహా పాత్రలు అనేకం పోషించారు కైకాల సత్యనారాయణ తెలుగు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాగా, తిలకన్ మలయాళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు.ఇక ప్రాణ్ బాలీవుడ్ లో కొన్నాళ్లపాటు నటుడు విలన్ గా అనేక సినిమాల్లో నటించాడు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ముగ్గురు ఒకే తరహా నటులు కూడా ఒకే పాత్రను వారి వారి భాషల్లో ఒకరు చేసింది మరొకరు చేశారు.ఇది నిజంగా యాదృచికమనే చెప్పాలి.
కైకాల సత్యనారాయణ తన సొంత ప్రొడక్షన్ కంపెనీ ద్వారా చిరంజీవి హీరోగా ఒక సినిమా తీశాడు.ఆ సినిమా పేరు కొదమసింహం.
ఈ చిత్రంలో నటుడు ప్రాణ్ మరియు కైకాల సత్యనారాయణ కలిసి నటించారు.ప్రాణ్ సినిమాలో విలన్ గా నటించగా సత్యనారాయణ ఆ చిరంజీవికి తండ్రి పాత్రలో నటించాడు.
ఇక తిలకన్, సత్యనారాయణ కూడా కలిసి నటించారు.వీరిద్దరూ కలిసి నటించిన సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్ర తిలకన్ చేస్తే, ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు.ఇలా ఒకరి పాత్రను ఆ తర్వాత కాలంలో మరొకరు పోషించడం నిజంగా యాదృచ్ఛికమే.
ఈ ముగ్గురు నటులలో ప్రాణ్ వయసులో కాస్త పెద్దవాడు 1920లో పుట్టి బాలీవుడ్ లో అనేక సినిమాలో నటించి సౌత్ ఇండియాలోనూ కొన్ని సినిమాల్లో నటించాడు.ఇక 1935 జూలైలో సత్యనారాయణ మరియు తిలకన్ కొన్ని రోజుల తేడాతో ఒకేసారి జన్మించారు.
తిలకం మలయాళ ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా వినడంతో ఆకట్టుకోగా తెలుగులో కైకాల సత్యనారాయణ కొన్ని వందల సినిమాల్లో నటించాడు.