భారతీయ సీనియర్ దౌత్యవేత్త అమన్‌దీప్ సింగ్ గిల్‌కు ఐక్యరాజ్యసమితిలో కీలక పదవి దక్కింది.టెక్నాలజీపై తన రాయబారిగా ఆయనను యూఎన్ సెక్రటరీ జనరల్ నియమించారు.డిజిటల్ టెక్నాలజీపై అమన్‌దీప్‌కు వున్న అనుభవం ఉపయోగపడుతుందని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది.2016 నుంచి 2018 వరకు జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ సదస్సుకు భారత రాయబారిగా, శాశ్వత ప్రతినిధిగా అమన్‌దీప్ వ్యవహరించారు.అలాగే ఇంటర్నేషనల్ డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కోలాబరేటివ్ (ఐ డీఏఐఆర్) ప్రాజెక్ట్‌కి ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
గతంలో డిజిటల్ కో ఆపరేషన్ (2018-2019)పై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ హై లెవల్ ప్యానెల్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కో లీడ్‌గా వ్యవహరించారు.
డిజిటల్ కో ఆపరేషన్‌పై ఉన్నత స్థాయి ప్యానెల్ నివేదికను అందించడంతో పాటు 2017 – 2018 మధ్య ప్రాణాంతక ఆయుధ వ్యవస్థలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నియంత్రించేందుకు ఆయన ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నించారు.
1992లో ఇండియన్ డిప్లొమాటిక్ సర్వీసులో చేరిన అమన్‌దీప్ .టెహ్రాన్, కొలంబోలలో నిరాయుధీకరణ, వ్యూహాత్మక సాంకేతికత, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలలో వివిధ హోదాలలో పనిచేశాడు.ఆయన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్ కూడా.
లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి మల్టీలెటరల్ ఫోరమ్‌లలో న్యూక్లియర్ లెర్నింగ్‌లో పీహెచ్‌డీ, చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, జెనీవా యూనివర్సిటీ నుంచి ఫ్రెంచ్ హిస్టరీ అండ్ లాంగ్వేజ్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా పొందారు.