ప్రపంచ దేశాలు అన్ని కరోనాతో విలవిలలాడుతున్న నేపథ్యంలో అన్ని ఫార్మా కంపెనీలకు చెందిన శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను కనుగొనే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.వీలైనంత తొందరగా వ్యాక్సిన్ ను కనుక్కుంటే మహమ్మారిని కట్టడి చేయొచ్చని భావించిన శాస్త్రవేత్తలు ఇప్పటికే 2-దశల క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతం చేసుకున్నాయి.
ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నం చేసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా వాక్సిన్ కనుగొని వాలంటీర్లకు టీకాలు వేసింది.
వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేవలం 24 గంటలు కూడా గడవకుండానే ఈ వ్యాక్సిన్ వల్ల సమస్యలు తలెత్తుతాయి.నేషనల్ హెల్త్ సర్వీస్ కు చెందిన ఇద్దరు వర్కర్లు ఈ వ్యాక్సిన్ వేయించుకోగా ఎంత అస్వస్థతకు గురయ్యారు.
వ్యాక్సిన్ తీసుకున్న ఒక్కరోజులోనే వారికి శరీరమంతా దద్దుర్లు రావడంతో పాటు, రక్త ప్రసరణ సమస్యలు తలెత్తాయి.దీంతో యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది.

సాధారణంగా కొంతమందికి వారి శరీర తత్వాన్ని బట్టి ఏవైనా మందులు, ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వారికి అలర్జీలు ఏర్పడడం సర్వసాధారణమే.అలాంటి అలర్జీలు ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి రావద్దని ప్రభుత్వాలు హెచ్చరించాయి.ఇలా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు వారి మెడికల్ హిస్టరీని ఒకసారి పరిశీలించాలని అధికారులు తెలియజేశారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లు ఇద్దరికీ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని, వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్య అధికారులు తెలియజేశారు.
కేవలం బ్రిటన్ ప్రభుత్వం కనుగొన్న మాత్రమే కాకుండా, ఇతర ఫార్మా కంపెనీలు సంబంధించిన వ్యాక్సిన్లు సైతం కొన్ని చర్మ సమస్యలు తలెత్తాయని వైద్య అధికారులు తెలిపారు.అయితే ఇలా వ్యాక్సిన్ వేసేటప్పుడు కొంతమందిలో ఇలాంటి కొద్దిపాటి అలర్జీలు రావడం సర్వసాధారణమేనని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.