ఈతరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు స్టార్ యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించిన యాంకర్లలో ఉదయభాను ఒకరు.సుమ, ఉదయభాను దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టగా సుమ ఇప్పటికీ ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తుంటే ఉదయభాను అడపాదడపా ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం.
యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఉదయభాను నటిగా కూడా సత్తా చాటారు.
ఉదయభాను గురించి పలు గాసిప్స్ తరచూ ప్రచారంలోకి వస్తున్నా వాటి గురించి స్పందించడానికి ఆమె ఇష్టపడటం లేదు.
సోషల్ మీడియాలో కూడా ఉదయభాను ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం లేదు.తాజాగా ఉదయభాను ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
వీడియోలో ఉదయభాను టీ తాగుతూ ఈ గ్లాస్ లో ఛాయ్ తాగితే కిక్కే వేరప్ప అని కామెంట్ చేశారు.
గాజు గ్లాసులో ఉదయభాను టీ తాగుతూ ఈ వీడియోను పోస్ట్ చేయగా గాజు గ్లాసు అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సింబల్ అనే సంగతి తెలిసిందే.ఉదయభాను జనసేనకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని కొంతమంది చెబుతున్నారు.రాబోయేరోజుల్లో ఉదయభాను ఎన్నికల్లో పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది.
అయితే తన పోస్ట్ కు సంబంధించి ఉదయభాను నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
ఉదయభాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఉదయభాను ప్లానింగ్ ఏ విధంగా ఉందో చూడాల్సి ఉంది.జనసేన పార్టీలో చేరడానికి చాలామంది సినీ సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారని సమాచారం అందుతోంది.
ఉదయభాను కెరీర్ పరంగా బిజీ కావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.