హెచ్- 1బీ ఎఫెక్ట్....7 లక్షల భారతీయులకి ముప్పు

ట్రంప్ అమెరికాలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ ప్రకారం అమెరికా అభివృద్దిలో ఈ రోజు వరకూ కూడా తమవంతు ఎనలేని కృషి చేస్తున్న ఎన్నారై లపై ముఖ్యంగా భారతీయ ఎన్నారైలపై వారి భవిష్యత్తుపై ఉక్కుపాదం మోపుతున్నాడు.ట్రంప్ హెచ్‌-1బీ జారీ ఫై అమలు చేయనున్న కొత్త నిభంధనలతో భారతీయులకి గడ్డుకాలమేనని చెప్పడంలో సందేహం లేదనే చెప్పాలి…

 Trumps New Immigration Policy Threatens Up To 7 Lakh Indians-TeluguStop.com

ట్రంప్‌ సర్కారు ఆదేశాల మేరకు హెచ్‌-1బీ వీసా గడువు పూర్తయినా లేదా పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారిని అక్టోబరు ఒకటో తేదీ నుంచి స్వదేశానికి పంపించేందుకు అక్కడి అధికారులు చర్యలు ఇప్పటికే చేపట్టారు…అయితే ఈ ప్రభావం వలన దాదాపు 7 లక్షల మంది భారతీయులపై పడనుంది.వీసా గడువు ముగిసిన తర్వాత 240 రోజుల వరకు అమెరికాలో ఉండే అవకాశముంది…అయితే

గడువు ముగిసేలోగా హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ జరిగితే అక్కడ కొనసాగవచ్చు.వీసా పునరుద్ధరణ జరగకపోతే వెంటనే అమెరికా వదిలి వెళ్లిపోవాలి.

వీసా పునరుద్ధరణ దరఖాస్తు తిరస్కరణకు గురైనా అనధికారికంగా అక్కడ నివసించే వారిని తమ ముందు హాజరు కావాల్సిందిగా(నోటీస్‌ టు అప్పీయర్‌-ఎన్‌టీఏ) అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సేవల విభాగం(యూఎస్‌ సిటిజన్‌షి్‌ప అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీ్‌స-యూఎ్‌ససీఐఎస్‌) ఆదేశిస్తుంది.

అయితే ఎన్‌టీఏ ఒకసారి జారీ అయితే సదరు వ్యక్తి ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు.విచారణ పూర్తయ్యే వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఇస్తారు.ఈ కాలంలో వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్‌ అధికారి ఎదుట హాజరు కావాలి.

ఆ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేకుంటే అతడిపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు.అయితే ఈ ఎఫెక్ట్ తో నష్టపోయే జాబితాలో భారతీయులు ముందు ఉంటే ఆ తరువాత జాబితాలో చైనీయులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube