అమెరికాలో దిగ్గజ సంస్థ అయిన జనరల్ మోటార్స్ తాజాగా 14,800 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలికిన సంఘటన విదితమే అయితే ఇప్పుడు వారందరి పరిస్థితి ఏమి కాను.దాంతో ఈ విషయం ట్రంప్ దృష్టికి వెళ్ళగానే ఒక్క సారిగా జీఎం సంస్థపై ఊగిపోయారు.
సదరు సంస్థ స్థానిక ప్రజలని విదులనుంచీ తొలగించడంపై ఫైర్ అయ్యారు.ఉద్యోగులని తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
మీకు వ్యయ ,నియంత్రణలు అవసరం అనుకుంటే చైనాలో కార్ల తయారీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని హుకుం జారీ చేశారు.అమెరిక, కెనడాలలో కార్ల ఉత్పత్తిని తగ్గించటం ద్వారా దాదాపు 14,800 ఉద్యోగావకాశాలను రద్దు చేస్తున్నట్లు ఈ కంపెనీ ప్రకటించిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ విధంగా హెచ్చరికలు చేయడం ఆ కంపెనీనీ షాక్ లోకి నెట్టింది.
అయితే ట్రంప్ తాజా ఆదేశాలపై జీఎం సంస్థ ఆన్ద్లోనలలో పడిందని తెలుస్తోంది.సహజంగా తమ ఉత్పత్తులకి గిరాకీ ఉన్న చోట మాత్రమే సంస్థ తమ పనులని ముమ్మరం చేస్తుంది.
మరి అలాంటి సంస్థ తీసుకున్న నిర్ణయంతో ట్రంప్ విభేదించడం ఇప్పుడు ఆ కంపెనీని ఒకింత సందిగ్ధం లోకి నెట్టేసింది.